Harihara Veeramallu Collection Day 11: హరిహర వీరమల్లు 11 రోజుల కలెక్షన్స్.. భారీ నష్టాలు తప్పించుకోవాలంటే?

లాంగ్ గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ ఆయన సరసన హీరోయిన్‌గా నటించింది. జూలై 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు హరిహర వీరమల్లు చిత్రానికి దర్శకత్వం వహించారు. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఏఎం రత్నం సమర్పకుడిగా వ్యవహరంచారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? 11వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

హరిహర వీరమల్లు బడ్జెట్ & బిజినెస్
హరిహర వీరమల్లుకు రూ.250 కోట్ల బడ్జెట్‌ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 37 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పు గోదావవరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ మూవీకి ఆంధ్రా, నైజాంలలో 103 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే .. కర్ణాటక, తమిళనాడు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 12.5 కోట్లు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. దాంతో వరల్డ్ వైడ్‌గా హరిహర వీరమల్లుకు 126 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జిరిగింది.

Harihara Veeramallu Day 11 Box Office Collections Worldwide Pawan Kalyan Movie Recovers Only these amount

హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్
తెలుగు రాష్ట్రాలలో హరిహర వీరమల్లు లాభాల్లోకి రావాలంటే 104 కోట్ల రూపాయల షేర్.. 210 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. వరల్డ్ వైడ్‌గా పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 127 కోట్ల రూపాయల షేర్.. 260 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని వాల్యూ నిర్దేశించారు. హరిహర వీరమల్లును వరల్డ్ వైడ్‌గా 5000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

హరిహర వీరమల్లు 10 రోజుల కలెక్షన్స్
పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 13 కోట్ల రూపాయలు, ఫస్ట్ డే నాడు 35 కోట్ల రూపాయలు, రెండో రోజున రూ.9 కోట్ల నెట్, 3వ రోజున రూ.9 కోట్లు, 4వ రోజున 11 కోట్ల రూపాయలు, 5వ రోజున రూ.2 కోట్లు, 6వ రోజున 2 కోట్ల కలెక్షన్స్, 7వ రోజున 1 కోటి రూపాయలు, 8వ రోజున రూ.46 లక్షలు, 9వ రోజున 28 లక్షలు, 10వ రోజున 44 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా 10 రోజుల వరకు ఇండియా వైడ్‌గా హరిహర వీరమల్లు మూవీకి 83 కోట్ల రూపాయల నెట్, 98 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 16 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకుని 10 రోజుల వరకు హరిహర వీరమల్లుకు 114 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి

తెలుగు రాష్ట్రాల్లో వీరమల్లు కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల వసూళ్లను పరిశీలిస్తే.. స్పెషల్ షోలతో 9 కోట్ల రూపాయలు, తొలి రోజున 32 కోట్ల రూపాయలు, 2వ రోజున 4 కోట్ల రూపాయలు, 3వ రోజున 5 కోట్ల రూపాయలు, 4వ రోజున 6 కోట్ల రూపాయలు, 5వ రోజున 2 కోట్ల రూపాయలు, 6వ రోజున 62 లక్షల రూపాయలు, 7వ రోజున 34 లక్షల రూపాయలు, 8వ రోజు 22 లక్షలు, 9వ రోజు 17 లక్షలు, 10వ రోజున 32 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో 10 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లుకు 58 కోట్ల రూపాయల షేర్, 85 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాంలో 19 కోట్లు, సీడెడ్‌లో 8 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 6 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 5 కోట్ల రూపాయలు, గుంటూరులో 6 కోట్ల రూపాయలు, కృష్ణాలో 5 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2 కోట్ల రూపాయలు చొప్పున వసూళ్లు అందుకుంది హరిహర వీరమల్లు. ఇండియాలోని ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 11 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది. ఓవర్సీస్‌లో 7 కోట్ల రూపాయల షేర్ .. 16 కోట్ల రూపాయల గ్రాస్ చొప్పున వరల్డ్ వైడ్‌గా 10 రోజుల వరకు 70 కోట్ల రూపాయల షేర్.. 114 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది.

హరిహర వీరమల్లు 11వ రోజు కలెక్షన్స్:
రిలీజైన ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ వద్ద ఊపు చూపించిన హరిహరి వీరమల్లు.. 5వ రోజు నుంచి క్రమం తప్పకుండా కలెక్షన్స్ కోల్పోతూ వచ్చింది. అర్బన్, పట్టణ ప్రాంతాలతో పాటు రూరల్ ఏరియాలలోనూ బుకింగ్స్ నామమాత్రంగా జరిగినట్లుగా సాక్‌నిక్ తెలిపింది. ఆదివారం కావడంతో చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద వీరమల్లు సందడి కనిపించింది. ఓవరాల్‌గా 35 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. దీంతో 11వ రోజున హరిహర వీరమల్లు చిత్రం వరల్డ్ వైడ్‌గా 75 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దీనితో కలిపి పవన్ కళ్యాణ్ మూవీ 11 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 115 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హరిహర వీరమల్లు లాభాల్లోకి రావాలంటే ఇంకా బాక్సాఫీస్ వద్ద 57 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. మరి రెండో వారంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X