Harihara Veeramallu Box Office Day 2: 100 కోట్లకు చేరువగా హరిహర వీరమల్లు.. పవన్ మూవీకి 2వ రోజు ఎన్ని కోట్లంటే?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. తొలుత ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. ఆయన తప్పుకుని జ్యోతికృష్ణకు బాధ్యతలు అప్పగించారు. ఈ చిత్రానికి స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సమర్పకుడిగా వ్యవహరించగా.. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మాణం వహించారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలకపాత్ర పోషించారు.

ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. హరి హర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? రెండో రోజు వరల్డ్ వైడ్‌గా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..

Harihara Veeramallu Day 2 Expected Box Office Collections Worldwide Pawan Kalyan Movie

హరిహర వీరమల్లు బడ్జెట్ ఎంత?
సినిమాటిక్ అనుభూతిని అందించడానికి గాను ఈ చిత్రాన్ని భారీ సెట్స్‌ వేసి చిత్రీకరించారు. నిర్మాణ విలువలు ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్న యూనిట్ సభ్యులు.. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనులను విదేశాల్లోని అత్యున్నత సంస్థల్లో చేయించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి హరిహర వీరమల్లు చిత్రానినికి రూ.350 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

హరిహర వీరమల్లు బిజినెస్
దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమా విడుదల అవుతుండటం, టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో హరిహర వీరమల్లుపై చిత్రసీమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో విషయానికి వస్తే.. నైజాంలో 37 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పు గోదావవరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో హరిహర వీరమల్లుకు నైజాం, ఆంధ్రాలో కలిపి 103 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ బిజినెస్ వివరాలు పరిశీలిస్తే.. కర్ణాటక, తమిళనాడు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 12.5 కోట్ల మేర బిజినెస్ అయింది. ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు మేర వీరమల్లు బిజినెస్ చేసింది. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ మూవీకి 126 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జిరిగింది. హరిహర వీరమల్లను వరల్డ్ వైడ్‌గా 5000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్
హరిహర వీరమల్లు చిత్రం తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 104 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 210 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే 127 కోట్ల రూపాయల షేర్.. 260 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ అనలిస్టులు వాల్యూ కట్టారు.

హరిహర వీరమల్లు తొలిరోజు కలెక్షన్స్
హరిహర వీరమల్లు కలెక్షన్స్ విషయానికి వస్తే.. రిలీజ్‌కు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.12.93 కోట్ల రూపాయలు వచ్చాయి. తొలిరోజు ఇండియా వైడ్ 44.7 కోట్ల రూపాయల నెట్, 52.7 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 11 కోట్ల రూపాయలు కలిపి వరల్డ్ వైడ్‌గా తొలి రోజు రూ.64 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తద్వారా 2025లో టాలీవుడ్ నుంచి సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా హరిహర వీరమల్లు నిలిచింది. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ 79.18 కోట్ల ఓపెనింగ్స్‌తో టాప్‌లో నిలిచింది.

హరిహర వీరమల్లు రెండో రోజు కలెక్షన్స్:
హరిహర వీరమల్లుపై నెగిటివ్ టాక్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తుండటంతో కొన్ని ఏరియాలలో ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ దానిని తట్టుకుని నిలబడుతూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. రెండో రోజు మధ్యాహ్నం నాటికి 17.78 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిల్క్ తెలిపింది. రెండో రోజు హరిహర వీరమల్లు చిత్రం ఆంధ్రా, నైజాంలలో 23 కోట్లు.. కర్ణాటక, తమిళనాడు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.2 కోట్ల చొప్పున సెకండ్ డే వరల్డ్ వైడ్‌గా 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X