Harihara Veeramallu Box Office Day 3: హరిహర వీరమల్లు కలెక్షన్స్.. పవన్ మూవీకి 3వ రోజు ఎన్ని కోట్లంటే?
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించగా.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో హరి హర వీరమల్లు చిత్రం రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? మూడవ రోజు వరల్డ్ వైడ్‌గా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..

హరిహర వీరమల్లు బడ్జెట్ & బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి హరిహర వీరమల్లు చిత్రానినికి రూ.350 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 37 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పు గోదావవరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో హరిహర వీరమల్లుకు తెలుగు రాష్ట్రాల్లో 103 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్
కర్ణాటక, తమిళనాడు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 12.5 కోట్లు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు మేర వీరమల్లు బిజినెస్ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లుకు వరల్డ్ వైడ్‌గా 126 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జిరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 104 కోట్ల రూపాయల షేర్.. 210 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు తెలిపారు. వరల్డ్ వైడ్‌గా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే 127 కోట్ల రూపాయల షేర్ .. 260 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని వాల్యూ కట్టారు. పవన్ కళ్యాణ్ తెరపై కనిపించి మూడేళ్లు కావొస్తుండటంతో భారీ అంచనాల నేపథ్యంలో హరిహర వీరమల్లును వరల్డ్ వైడ్‌గా 5000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
హరిహర వీరమల్లు రెండు రోజుల కలెక్షన్స్
హరిహర వీరమల్లు కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఇండియా వైడ్ రిలీజ్‌కు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 12.75 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్స్ రాగా.. రిలీజ్ రోజున 34.75 కోట్ల రూపాయలు నెట్ వచ్చాయి. ఇక రెండో రోజున రూ.8.79 కోట్ల నెట్ చొప్పున రెండ్రోజుల్లో 57 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించాడు వీరమల్లు.
తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.12.75 కోట్లు, తొలిరోజున 34.65 కోట్ల రూపాయలు, రెండో రోజున 8.79 కోట్ల రూపాయల చొప్పున 56.19 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టాడు పవన్ కళ్యాణ్. మొత్తంగా రెండ్రోజుల వరకు ఇండియాలో నికరంగా 57 కోట్ల రూపాయలు రాబట్టగా.. దీనికి ఓవర్సీస్ వసూళ్లు రూ.11 కోట్లు కలిపి వరల్డ్ వైడ్‌గా రూ.68 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్నాడు వీరమల్లు.
హరిహర వీరమల్లు మూడో రోజు కలెక్షన్స్:
హరిహర వీరమల్లుపై నెగిటివ్ టాక్ గట్టి ప్రభావం చూపుతోంది. రెండో రోజు నుంచే బుకింగ్స్ భారీగా డ్రాప్ అవ్వగా.. మూడో రోజు కాస్త మెరుగుదల కనిపించింది. వర్షాలు తెరిపినివ్వడంతో పాటు శనివారం కావడంతో బుకింగ్స్ పెరిగినట్లుగా సాక్‌నిల్క్ తెలిపింది. మూడో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు హరిహర వీరమల్లుకు 18.02 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. పవన్ కళ్యాణ్ చిత్రం మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు.. కర్ణాటక, తమిళనాడు+ రెస్టాఫ్ ఇండియాలో రూ.3 కోట్లు, ఓవర్సీస్‌లో కోటి రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











