Harihara Veeramallu Box Office Day 4: హరిహర వీరమల్లు కలెక్షన్స్.. పవన్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మించిన చిత్రం హరిహర వీరమల్లు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించారు. జూలై 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సమర్పకుడిగా వ్యవహరించారు. హరిహర వీరమల్లులో బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? నాలుగవ రోజు వరల్డ్ వైడ్‌గా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..

హరిహర వీరమల్లు బడ్జెట్ & బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి హరిహర వీరమల్లు చిత్రానికి రూ.250 కోట్ల బడ్జెట్ అయినట్లు ఫిలింనగర్ తెలిపాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 37 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పు గోదావవరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో హరిహర వీరమల్లుకు తెలుగు రాష్ట్రాల్లో 103 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 12.5 కోట్లు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు మేర వీరమల్లు బిజినెస్ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో కలిపి వరల్డ్ వైడ్‌గా పవన్ కళ్యాణ్ మూవీకి 126 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జిరిగింది.

Harihara Veeramallu Day 4 Expected Box Office Collections Worldwide Pawan Kalyan Movie Heading towards 100 crore

హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఆంధ్రా, నైజాంలలో హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ కావాలంటే 104 కోట్ల రూపాయల షేర్.. 210 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే 127 కోట్ల రూపాయల షేర్.. 260 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని వాల్యూ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో హరిహర వీరమల్లును వరల్డ్ వైడ్‌గా 5000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

హరిహర వీరమల్లు మూడు రోజుల కలెక్షన్స్
హరిహర వీరమల్లు కలెక్షన్స్ విషయానికి వస్తే.. రిలీజ్ ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 12.75 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్స్ రాగా.. విడుదల రోజున 34.75 కోట్ల రూపాయలు నెట్ వచ్చాయి. ఇక రెండో రోజున రూ.8.79 కోట్ల నెట్, 3వ రోజున రూ.9.86 కోట్లు చొప్పున మూడు రోజుల వరకు ఇండియా వైడ్ రూ.65.36 కోట్ల నికర వసూళ్లను రాబట్టాడు వీరమల్లు. దీనికి ఓవర్సీస్ వసూళ్లు రూ.12.1 కోట్లు కలిపి వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల వరకు 77.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల వరకు హరిహర వీరమల్లు వసూళ్లను పరిశీలిస్తే.. నైజాంలో రూ.24.13 కోట్లు, సీడెడ్‌లో 7.98 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.7.45 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.6.79 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.5.73 కోట్లు, గుంటూరులో రూ.6.62 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.4.85 కోట్లు, నెల్లూరులో రూ.2.65 కోట్లు చోప్పున నికరంగా రూ.65 కోట్ల కలెక్షన్స్ రాబట్టాడు పవన్ కళ్యాణ్.

హరిహర వీరమల్లు నాలుగో రోజు కలెక్షన్స్:
ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో హరిహర వీరమల్లుకు బుకింగ్స్ బాగా జరిగినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. నాలుగో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు హరిహర వీరమల్లుకు 24.49 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఇది నిన్నటి పోలిస్తే ఎక్కువ. ఫస్ట్ షో, సెకండ్ షోలకు యువత, ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. దాంతో హరిహర వీరమల్లు చిత్రానికి నాలుగో రోజున తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల రూపాయలు.. కర్ణాటక, తమిళనాడు+ రెస్టాఫ్ ఇండియాలో రూ.3 కోట్లు, ఓవర్సీస్‌లో కోటి రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 13 కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

హరిహర వీరమల్లు చిత్రానికి ఇప్పటి వరకు 47 కోట్ల రేంజ్‌లో షేర్ వచ్చినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మూవీ వరల్డ్‌ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.80 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. రేపటి నుంచి వర్కింగ్ డేస్ మొదలు కానుండటంతో హరిహర వీరమల్లు ఎలాంటి మేజిక్ చేస్తాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X