Harihara Veeramallu Box Office Day 5: హరిహర వీరమల్లుకు షాకింగ్ కలెక్షన్లు.. 5వ రోజు ఎన్ని కోట్లంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా అట్టహాసంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏఎం జ్యోతి కృష్ణ.. వెండితెరపై భావోద్వేగాలను భారీగా పండించారు. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.
హిందువులప ఔరంగజేబు దాష్టికాలు అనే కథా నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వీఎస్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. హరి హర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నైజాంలో హక్కులు 37 కోట్ల రూపాయలు, సీడెడ్ 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర 12 కోట్లు, తూర్పు గోదావవరి 9.5 కోట్లు, పశ్చిమ గోదావరి 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్ాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా నైజాం, ఆంధ్రాలో కలిపి 103 కోట్ల రూపాయలు మేర జరిగింది.
ఈ సినిమా తెలుగేతర రాష్ట్రాలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 12.5 కోట్ల మేర బిజినెస్ అయింది. ఓవర్సీస్‌లో రైట్స్ 10 కోట్ల రూపాయలు మేర జరిగింది. ఈ చిత్రానికి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 126 కోట్ల మేర బిజినెస్ జిరిగింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో వరల్డ్ వైడ్ 5000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. పెయిడ్ ప్రీమియర్లకు 8.5 కోట్ల రూపాయలు, తొలి రోజు 31.5 కోట్ల రూపాయలు, 2వ రోజు 4 కోట్ల రూపాయలు, 3వ రోజు 4. కోట్ల రూపాయలు, 4వ రోజు 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నైజాంలో 18 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 7.6 కోట్లు, ఉత్తరాంధ్రలో 7.2 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 5.5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.2 కోట్లు, గుంటూరులో 5.2 కోట్లు, కృష్ణా జిల్లాలో 4.5 కోట్లు, నెల్లూరులో 1.9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆంధ్రా, నైజాంలో 54 కోట్ల షేర్, 78 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. పెయిడ్ ప్రీమియర్ల ద్వారా 15 కోట్ల రూపాయలు, తొలి రోజు 41 కోట్ల రూపాయలు, రెండో రోజు 10 కోట్ల రూపాయలు, మూడో రోజు 10.5 కోట్ల రూపాయలు, 4వ రోజు 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కన్నడలో 6 కోట్ల రూపాయలు, తమిళంలో 1 కోటి రూపాయలు, మలయాళంలో 20 లక్షల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా గత నాలుగు రోజుల్లో కన్నడ, తమిళం, మలయాళం, హిందీ ప్రాంతాల్లో 97.5 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా 107.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఈ సినిమా 5వ రోజు అంటే తొలి సోమవారం భారీగా క్షీణించే అవకాశం కనిపిస్తున్నది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు గ్రాస్, తెలుగేతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు గ్రాస్ వసూలు చేస్తుంది. మొత్తంగా ఈ మూవీ 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఈ సినిమా 110 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











