Harihara Veeramallu Box Office Day 6: భారీగా క్షీణించిన హరిహర వీరమల్లు కలెక్షన్స్.. 6వ రోజు ఎన్ని కోట్లంటే?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మించగా.. స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సమర్పించారు. తొలుత ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా ఆయన తప్పుకోవడం జ్యోతికృష్ణ బాధ్యతలు స్వీకరించారు. జూలై 24న హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా పరిచేశారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? ఆరవ రోజు వరల్డ్ వైడ్‌గా హరిహర వీరమల్లు కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..
హరిహర వీరమల్లు బడ్జెట్ & బిజినెస్
హరిహర వీరమల్లు చిత్రం రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 37 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పు గోదావవరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ మూవీకి ఆంధ్రా, నైజాంలలో 103 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే .. కర్ణాటక, తమిళనాడు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 12.5 కోట్లు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు మేర వీరమల్లు బిజినెస్ చేసింది. దీంతో కలుపుకుని వరల్డ్ వైడ్‌గా హరిహర వీరమల్లుకు 126 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జిరిగింది.

హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్
తెలుగు రాష్ట్రాలలో హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ కావాలంటే 104 కోట్ల రూపాయల షేర్.. 210 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే 127 కోట్ల రూపాయల షేర్.. 260 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని విలువ కట్టారు. పవన కళ్యాణ్ నటించిన చిత్రం థియేటర్‌లలో దిగి 3 ఏళ్లు కావొస్తుండటంతో నెలకొన్న అంచనాల నేపథ్యంలో హరిహర వీరమల్లును వరల్డ్ వైడ్‌గా 5000 స్క్రీన్లలో భారీగా రిలీజ్ చేశారు.
హరిహర వీరమల్లు ఐదు రోజుల కలెక్షన్స్
హరిహర వీరమల్లు కలెక్షన్స్ విషయానికి వస్తే.. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 12.75 కోట్ల రూపాయలు, ఫస్ట్ డే నాడు 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున రూ.8.79 కోట్ల నెట్, 3వ రోజున రూ.9.15 కోట్లు, 4వ రోజున 10.6 కోట్ల రూపాయలు, 5వ రోజున రూ.2.1 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఐదు రోజుల వరకు ఇండియా వైడ్ ఈ చిత్రానికి 78 కోట్ల రూపాయల నెట్, 91 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల వరకు హరిహర వీరమల్లు వసూళ్లను పరిశీలిస్తే.. స్పెషల్ షోలతో 8.50 కోట్ల రూపాయలు, తొలి రోజున 31.43 కోట్ల రూపాయలు, 2వ రోజున 3.82 కోట్ల రూపాయలు, 3వ రోజున 4.45 కోట్ల రూపాయలు, 4వ రోజున 5.82 కోట్ల రూపాయలు, 5వ రోజున 1.16 కోట్ల రూపాయలు చొప్పున 55.18 కోట్ల రూపాయల షేర్, 80.45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 18.42 కోట్లు, సీడెడ్‌లో 7.82 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 7.34 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5.46 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 4.29 కోట్ల రూపాయలు, గుంటూరులో 5.31 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4.61 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.93 కోట్ల రూపాయలు చొప్పున వసూళ్లు అందుకుంది హరిహర వీరమల్లు. ఇండియాలోని ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 14 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. వీటితో కలుపుకుని హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 66.28 కోట్ల రూపాయల షేర్.. 109 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది.
హరిహర వీరమల్లు ఆరో రోజు కలెక్షన్స్:
వీకెండ్ వరకు నెట్టుకొచ్చిన హరిహర వీరమల్లు చిత్రం వర్కింగ్ డేస్‌లో భారీగా కలెక్షన్స్‌ను కోల్పోయింది. 5వ రోజైన సోమవారం కేవలం 2.1 కోట్ల రూపాయల నెట్ రాబట్టగా.. 6వ రోజు మరింతగా కలెక్షన్స్ క్షీణించాయి. దాంతో ఆరవ రోజు పవన్ కళ్యాణ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 1.80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో హరిహర వీరమల్లు చిత్రం 6 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 111 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











