Harihara Veeramallu Box Office Day 7: చేతులెత్తేసిన హరిహర వీరమల్లు.. 7వ రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. జూలై 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద బుధవారంతో ఏడు రోజులు పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగపెట్టనుంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికి పవన్ తన ఇమేజ్‌తో వీరమల్లును నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? ఏడో రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ జంటగా నటించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరించగా.. ఏఎం రత్నం సమర్పకుడిగా వ్యవహరించారు. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వ్యవహరించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా పరిచేశారు.

Harihara Veeramallu Day 7 Expected Box Office Collections Worldwide Pawan Kalyan Movie struggle continues

హరిహర వీరమల్లు బడ్జెట్ & బిజినెస్
హరిహర వీరమల్లు చిత్రం రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 37 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పు గోదావవరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ మూవీకి ఆంధ్రా, నైజాంలలో 103 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే .. కర్ణాటక, తమిళనాడు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 12.5 కోట్లు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు మేర వీరమల్లు బిజినెస్ చేసింది. దీంతో కలుపుకుని వరల్డ్ వైడ్‌గా హరిహర వీరమల్లుకు 126 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జిరిగింది.

హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్
తెలుగు రాష్ట్రాలలో హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ కావాలంటే 104 కోట్ల రూపాయల షేర్.. 210 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే 127 కోట్ల రూపాయల షేర్.. 260 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని విలువ కట్టారు. పవన్ కళ్యాణ్ చిత్రాన్ని 5000 స్క్రీన్లలో వరల్డ్ వైడ్‌గా భారీగా రిలీజ్ చేశారు.

హరిహర వీరమల్లు 6 రోజుల కలెక్షన్స్
హరిహర వీరమల్లు కలెక్షన్స్ విషయానికి వస్తే.. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 12.75 కోట్ల రూపాయలు, ఫస్ట్ డే నాడు 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున రూ.8.79 కోట్ల నెట్, 3వ రోజున రూ.9.15 కోట్లు, 4వ రోజున 10.6 కోట్ల రూపాయలు, 5వ రోజున రూ.2.1 కోట్లు, 6వ రోజున 1.75 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా 6 రోజుల వరకు ఇండియా వైడ్ ఈ చిత్రానికి 79.1 కోట్ల రూపాయల నెట్, 93.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో వీరమల్లు 6 రోజుల కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల వరకు హరిహర వీరమల్లు వసూళ్లను పరిశీలిస్తే.. స్పెషల్ షోలతో 8.50 కోట్ల రూపాయలు, తొలి రోజున 31.43 కోట్ల రూపాయలు, 2వ రోజున 3.82 కోట్ల రూపాయలు, 3వ రోజున 4.45 కోట్ల రూపాయలు, 4వ రోజున 5.82 కోట్ల రూపాయలు, 5వ రోజున 1.16 కోట్ల రూపాయలు, 6వ రోజున 1.75 కోట్ల రూపాయలు చొప్పున 55.80 కోట్ల రూపాయల షేర్, 81.70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల వరకు ప్రాంతాల వారీగా ఎంత వచ్చిందో పరిశీలిస్తే.. నైజాంలో 18.61 కోట్లు, సీడెడ్‌లో 7.90 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 7.44 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5.48 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 4.37 కోట్ల రూపాయలు, గుంటూరులో 5.37 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4.68 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.95 కోట్ల రూపాయలు చొప్పున వసూళ్లు అందుకుంది హరిహర వీరమల్లు. ఇండియాలోని ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 5.10 కోట్ల రూపాయల షేర్.. 12 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దాంతో హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల వరకు 67.01 కోట్ల రూపాయల షేర్.. 109.50 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది.

హరిహర వీరమల్లు ఏడో రోజు కలెక్షన్స్:
ఫస్ట్ వీకెండ్‌‌లో వపన్ కళ్యాణ్ ఇమేజ్‌తో నెట్టుకొచ్చిన హరిహర వీరమల్లు.. వర్కింగ్ డేస్‌లో మాత్రం పూర్తి చేతులెత్తేసింది. అర్బన్, రూరల్ ఏరియా అన్న తేడా లేకుండా బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. దీనికి తోడు మహావతార్ నర్సింహా, సైయారా వంటి సినిమాలు వీరమల్లుపై గట్టి ప్రభావం చూపాయి. ఏడో రోజు సాయంత్రం 6 గంటల వరకు 13.35 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీని నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. 7వ రోజైన బుధవారం హరిహర వీరమల్లుకు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలు, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్‌లో 50 లక్షల చొప్పున 1.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో తొలి వారం పవన్ కళ్యాణ్ చిత్రం 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు.

థియేట్రికల్ బిజినెస్ ప్రకారం హరిహర వీరమల్లు చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 60 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. టికెట్ బుకింగ్స్‌ను బట్టి చూస్తే చాలా వరకు వీరమల్లు థియేట్రికల్ రన్ ముగిసినట్లేనని భావిస్తున్నారు. జూలై 31న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ విడుదల కానుండటంతో వీరమల్లుకు స్క్రీన్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మూవీ ఎంత మేరకు కలెక్షన్స్ రాబడతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X