Harihara Veeramallu Collection Day 8: హరిహర వీరమల్లుకు 8వ రోజు ఎన్ని కోట్లంటే? పవన్ మూవీకి ఇంకెంత రావాలి?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వ్యవహరించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరించగా.. ఏఎం రత్నం సమర్పించారు. జూలై 24న హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద బుధవారంతో తొలివారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత? 8వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..
హరిహర వీరమల్లు బడ్జెట్ & బిజినెస్
హరిహర వీరమల్లు చిత్రం రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 37 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పు గోదావవరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ మూవీకి ఆంధ్రా, నైజాంలలో 103 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలోని రాష్ట్రాల విషయానికి వస్తే .. కర్ణాటక, తమిళనాడు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 12.5 కోట్లు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు మేర వీరమల్లు బిజినెస్ చేసింది. దాంతో వరల్డ్ వైడ్‌గా హరిహర వీరమల్లుకు 126 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జిరిగింది.

హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్
తెలుగు రాష్ట్రాలలో హరిహర వీరమల్లు లాభాల్లోకి రావాలంటే 104 కోట్ల రూపాయల షేర్.. 210 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. వరల్డ్ వైడ్‌గా పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 127 కోట్ల రూపాయల షేర్.. 260 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని విలువ కట్టారు. పవన్ కళ్యాణ్ చిత్రాన్ని 5000 స్క్రీన్లలో వరల్డ్ వైడ్‌గా భారీగా రిలీజ్ చేశారు.
హరిహర వీరమల్లు ఫస్ట్ వీక్ కలెక్షన్స్
హరిహర వీరమల్లు కలెక్షన్స్ విషయానికి వస్తే.. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 12.75 కోట్ల రూపాయలు, ఫస్ట్ డే నాడు 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున రూ.8.79 కోట్ల నెట్, 3వ రోజున రూ.9.15 కోట్లు, 4వ రోజున 10.6 కోట్ల రూపాయలు, 5వ రోజున రూ.2.1 కోట్లు, 6వ రోజున 1.75 కోట్ల కలెక్షన్స్, 7వ రోజున 1.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా తొలి వారం వరకు ఇండియా వైడ్ హరిహర వీరమల్లు మూవీకి 80 కోట్ల రూపాయల నెట్, 93.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లో 14.1 కోట్ల కలెక్షన్స్ కలుపుకుని తొలివారం హరిహర వీరమల్లుకు 110 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి
తెలుగు రాష్ట్రాల్లో వీరమల్లు ఫస్ట్ వీక్ కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో తొలివారం వీరమల్లు వసూళ్లను పరిశీలిస్తే.. స్పెషల్ షోలతో 8.50 కోట్ల రూపాయలు, తొలి రోజున 31.43 కోట్ల రూపాయలు, 2వ రోజున 3.82 కోట్ల రూపాయలు, 3వ రోజున 4.45 కోట్ల రూపాయలు, 4వ రోజున 5.82 కోట్ల రూపాయలు, 5వ రోజున 1.16 కోట్ల రూపాయలు, 6వ రోజున 62 లక్షల రూపాయలు, 7వ రోజున 34 లక్షల రూపాయలు వచ్చాయి. దీంతో తొలివారం వీరమల్లుకు 56.14 కోట్ల రూపాయల షేర్, 82.35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఆంధ్రా, నైజాంలో తొలి వారం ప్రాంతాల వారీగా ఎంత వచ్చిందో పరిశీలిస్తే.. నైజాంలో 18.69 కోట్లు, సీడెడ్‌లో 7.95 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 7.50 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5.49 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 4.42 కోట్ల రూపాయలు, గుంటూరులో 5.41 కోట్ల రూపాయలు, కృష్ణాలో 4.72 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.96 కోట్ల రూపాయలు చొప్పున వసూళ్లు అందుకుంది హరిహర వీరమల్లు. ఇండియాలోని ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 5.15 కోట్ల రూపాయల షేర్.. 12.17 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 14 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దాంతో హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి వారం 67.40 కోట్ల రూపాయల షేర్.. 110.30 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది.
హరిహర వీరమల్లు 8వ రోజు కలెక్షన్స్:
వర్కింగ్ డేస్ మొదలైన నాటి నుంచి హరిహర వీరమల్లు కోలుకోలేకపోయింది. రోజు రోజుకు క్రమం తప్పకుండా కలెక్షన్స్‌ను కోల్పోతూనే ఉంది. రెండో వారంలో తొలిరోజున అత్యంత దారుణంగా 13.6 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసింది. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ జూలై 31న విడుదల కావడంతో దీని ప్రభావం వీరమల్లుపై స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో 8వ రోజున హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో కలిపి 8వ రోజుల వరకు పవన్ కళ్యాణ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా నష్టాల్ని తప్పించుకోవాలంటే వరల్డ్ వైడ్‌గా మరో 59 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











