HHMV Business: పవన్ కల్యాణ్ కెరీర్ లో రికార్డు బిజినెస్.. ఎన్ని కోట్లు వస్తే హరిహర వీరమల్లు లాభాల్లోకి అంటే?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణల దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు. ఐదేళ్ల పాటు ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇండస్ట్రీలోనే భారీ అంచనాలున్న హరిహర వీరమల్లు ఓపెనింగ్స్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ప్రమోషన్స్‌‌లో పవన్ కళ్యాణ్ బిజీ
రిలీజ్‌కు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. జూలై 21న హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌తో పాటు అదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానిని అలాగే కంటిన్యూ చేస్తూ పవన్ కళ్యాణ్ విశాఖలో మీడియాతో చిట్ చాట్‌‌లో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. జూలై 23న విశాఖలో మరో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ మొత్తం సందడి చేయనుంది.

HariHara VeeraMallu Pre Release Business Pawan Kalyan s Film Set New Benchmark Here s BreakEven Target

హరిహర వీరమల్లు బడ్జెట్ ఎంత?
హరిహర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మించారు. బాలీవుడ్ నటుడు, యానిమల్ విలన్ బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. ఇటీవల కన్నుమూసిన లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావుకు హరిహర వీరమల్లు చివరి సినిమా. ఆయన ఇందులో కీలకపాత్ర పోషించినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

మైత్రీ చేతికి నైజాం రైట్స్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే డిస్కషన్ జరుగుతోంది. ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబడతాడు? ఎన్ని రికార్డులు బద్ధలు కొడతాడు? అంటూ పవన్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హరిహర వీరమల్లు నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. దిల్‌రాజు, ఏషియన్ సునీల్, సూర్యదేవర నాగవంశీ వంటి బడా నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ వీరమల్లు నైజాం రైట్స్‌ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకోవడం విశేషం.

హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి దాదాపు మూడేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో హరిహర వీరమల్లుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో పవన్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. హరిహర వీరమల్లుకు నైజాంలో 37 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగ్గా.. సీడెడ్‌లో రూ.16.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.12 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.9.50 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.7 కోట్లు, గుంటూరులో రూ.9.50 కోట్లు, కృష్ణాలో రూ.7.60 కోట్లు, నెల్లూరులో రూ.4.40 కోట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 102 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది హరిహర వీరమల్లు.

ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలలో రూ.12.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.10 కోట్లు చెప్పున వరల్డ్ వైడ్‌గా హరిహర వీరమల్లుకు రూ.126 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా హరిహర వీరమల్లు నిలిచింది.

హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
హరిహర వీరమల్లు చిత్రం తెలుగు రాష్ట్రాలలో లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 103 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 210 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. అలాగే తమిళనాడు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్‌లోనూ భారీ బిజినెస్ నేపథ్యంలో వరల్డ్ వైడ్‌గా హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ కావాలంటే 127 కోట్ల రూపాయల షేర్.. 260 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ అనలిస్టులు వాల్యూ కట్టారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోన్న పవన్ కళ్యాణ్.. ఈ టార్గెట్‌ను అవలీలగా ఛేదిస్తారని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X