Harom Hara Collections షాకింగ్‌గా హరోమ్ హర కలెక్షన్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన హరోమ్ హర చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సునీల్ మాళవిక శర్మ, సునీల్, జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ, లక్కి లక్ష్మీన్ తదితరులు నటించిన ఈ సినిమా జూన్ 14వ తేదీన రిలీజైంది. ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ రావడంతో ఓ మోస్తారుగా బాక్సాఫీస్ జర్నీ మొదలైంది. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే..
కుప్పం ప్రాంతంలో జరిగే మాఫియా దందా బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ చిత్రంలో గన్ బిజినెస్ ప్రధాన అంశంగా తెరకెక్కింది. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ చిత్రాన్ని 28 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టారగ్టె్‌ను 12 కోట్ల రూపాయల గ్రాస్‌గా నిర్ణయించారు.

హరోమ్ హర పెయిడ్ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ లభించింది. హైదరాబాద్‌లో ప్రదర్శించిన అన్నీ స్క్రీన్లు హౌజ్‌ఫుల్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. బుక్ మై షోలో 93 శాతం రెస్పాన్స్ వచ్చింది. ఇక పేటీఎంలో 91 శాతం ఓటింగ్ పాజిటివ్‌గా జరిగింది.
హరోమ్ హర సినిమాను సుమారుగా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తొలి ఆట తర్వాత మిక్స్ డ్ టాక్ రావడంతో లేటుగా ఆక్యుపెన్సీ పెరిగింది. మౌత్ టాక్ కొంత సానుకూలంగా ఉండటంతో సాయంత్రానికి ఓ మోస్తారు కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమాకు ఓవరాల్‌గా 40 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది.

ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయలు నికరంగా, 1 కోటి రూపాయలు గ్రాస్, అలాగే ఈ మూవీకి ఓవర్సీస్‌లో 50 లక్షల గ్రాస్ వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 1.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేశారు.


Click it and Unblock the Notifications











