ఈ వారం భాక్సాఫీస్ :టాక్ కి సంభంధం లేని కలెక్షన్స్
హైదరాబాద్ : మొన్న శుక్రవారం పూరీ జగన్నాథ్..హార్ట్ ఎటాక్,మంచు మోహన్ బాబు..పాండవులు పాండవులు తుమ్మెద విడుదలయ్యాయి. హార్ట్ ఎటాక్ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. పాండవులు పాండవులు తుమ్మెద హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ట్రేడ్ వర్గాల సమాచారం హార్ట్ ఎటాక్ చిత్రానికే కలెక్షన్స్ బాగున్నట్లు సమాచారం. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం చాలా సెంటర్లలో ఓపెనింగ్స్ రప్పించుకోలేకపోయింది. హార్ట్ ఎటాక్ చిత్రం మంచి ఓపినింగ్స్ తో విడుదలైంది.

అయితే వీకెండ్ కలెక్షన్స్ లో మాత్రం హార్ట్ ఎటాక్ ముందు ఉంది. అయితే సోమవారం నుంచి హార్ట్ ఎటాక్ కలెక్షన్స్ మందగించే అవకాశాలు ఉన్నాయి. పాండవలు పాండవులు తుమ్మెద ఇప్పటికే చాలా చోట్ల పికప్ అవుతోంది. అలాగే ఈ రెండు సినిమాలకు పబ్లిసిటీ క్యాపైన్ సైతం బాగా చేస్తున్నారు.
నితిన్ హీరోగా నటించిన హార్ట్ ఎటాక్ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించిందని, విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని పూరీ జగన్నాథ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'తొలిరోజు నైజాం ఏరియాలో ఒక కోటి తొమ్మిది లక్షల షేర్ వసూలు చేసి నితిన్ సినిమాల్లో రికార్డ్ నెలకొల్పింది. మిగతా ఏరియాల్లోనూ కలెక్షన్లు చాలా బాగున్నాయ'ని పూరీ జగన్నాథ్ చెప్పారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ.... 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా శుక్రవారం విడదులై, విజయవంతంగా ప్రదర్శించబడుతోందని, అందులో 'మోహిని' పాత్రకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. సోమవారం నుంచి ఈ రెండు చిత్రాలు ఏ రేంజిలో కలెక్టు చేస్తాయనే విషయంపై వాటి విజయం రేంజి ఆధారపడుతుంది.


Click it and Unblock the Notifications











