twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హలో గురూ 3 రోజుల కలెక్షన్లు.. రామ్‌కు బెస్టే.. కానీ లాభాల్లోకి రావాలంటే.

    |

    బాక్సాఫీస్ వద్ద హలో గురూ ప్రేమ కోసమే చిత్రం కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. సెలవుదినాలు, పండుగ వాతావరణం నేపథ్యంలో ఈ చిత్రం మోస్తారు కలెక్షన్లను సాధిస్తున్నది. రిలీజైన రెండు, మూడు తేదీల్లో ఈ చిత్రం భారీగానే వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం రూ.15.93 కోట్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. వివరాల్లోకి వెళితే...

    రామ్ కొత్త కథనంతో

    రామ్ కొత్త కథనంతో

    కెరీర్‌లో వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో హీరో రామ్ పోతినేనికి ఈ సినిమా కీలకంగా మారింది. ప్రకాశ్ రాజ్‌తో కలిసి రామ్ కొత్తరకమైన కథనంతో ముందుకొచ్చాడు. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. సెకండాఫ్‌లో కథ స్లోగా నెరేషన్ ఉందనే కంప్లయింట్ ప్రధానంగా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రామ్ కెరీర్‌లోనే బెటర్ కలెక్షన్లు రాబట్టడం జరిగింది.

    ‘హలో గురు ప్రేమ కోసమే' రివ్యూ, రేటింగ్ ‘హలో గురు ప్రేమ కోసమే' రివ్యూ, రేటింగ్

    రిలీజ్‌కు ముందే భారీగా అడ్వాన్స్

    రిలీజ్‌కు ముందే భారీగా అడ్వాన్స్

    లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందడం, రిలీజ్‌కు ముందే భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరగడంతో హలో గురూ ప్రేమ కోసమే చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. నక్కిన త్రినాథ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తొలి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. పండుగ సెలవులు కావడంతో సానుకూలంగా మారింది.

     మూడు రోజుల కలెక్షన్లు

    మూడు రోజుల కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.5.70 కోట్ల గ్రాస్ రాబట్టగా, డిస్టిబ్యూటర్లకు రూ.3.75 కోట్లు వచ్చాయి. శనివారం, ఆదివారం రెండు రోజుల్లో మంచి వసూళ్లను సాధించిపెట్టాయి. శనివారం రూ.5.66 కోట్లు, ఆదివారం రూ.4.57 కోట్లను హలో గురూ ప్రేమ కోసమే రాబట్టింది. దాంతో మొత్తంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 15.93 కోట్లు రాబట్టింది.

    లాభాల్లోకి నుంచి బయటపడాలంటే

    లాభాల్లోకి నుంచి బయటపడాలంటే

    తెలుగు రాష్ట్రాల్లో హలో గురూ ప్రేమ కోసమే థియెట్రికల్ రైట్స్‌ను రూ.20 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.10 కోట్ల నికర వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. ఇక డిస్టిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే ఈ చిత్రం మరో రూ.10 కోట్లు రాబట్టాల్సిన అవసరం ఉంది.

    English summary
    Hello Guru Prema Kosame (HGPK) has remained rock-steady at the box office on Friday and Saturday and its three-day collection has crossed Rs 15 crore gross mark in Andhra Pradesh and Telangana (AP/TG). The distributors have invested Rs 20 crore on the theatrical rights for the Telugu states. Hello Guru Prema Kosame earned them Rs 7.48 crore for them. The film has recovered 37.40 percent of their investments in two days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X