షాకింగ్: అరవిందను తొక్కేసిన హలో గురూ.. బాక్సాఫీస్ వద్ద దూకుడు.. ఇంకా నష్టాల్లోనే..
Recommended Video

ఎన్టర్జిక్ స్టార్ రామ్ పోతినేని, అందాల తార అనుపమ పరమేశ్వరన్ నటించిన హలో గురూ ప్రేమ కోసమే చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తొలి వారాంతంలో అరవింద సమేత, పందెం కోడి2 సినిమాలకు ధీటుగా కలెక్షన్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నది. ఈ చిత్రానికి తొలుత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ భారీ కలెక్షన్లతో దూసుకుపోవడం ట్రేడ్ వర్గాలకు ఆశ్యర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే..

సానుకూలంగా హాలీడేస్
దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజైన హలో గురూ ప్రేమ కోసమే చిత్రం తొలి రోజున భారీ వసూళ్లను సాధించింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే చిత్రమని మౌత్ టాక్‌తో సినిమా కలెక్షన్లు పుంజుకొన్నాయి. సెలవు రోజులు ఈ సినిమాకు సానుకూలంగా మారాయి.

వారాంతానికి రూ.19.68 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో తొలివారాంతం అంటే గత నాలుగు రోజుల్లో హలో గురూ ప్రేమ కోసమే రూ.19.68 కోట్లు గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. డిస్టిబ్యూటర్లకు ఈ చిత్రం రూ.12.95 కోట్లు వసూలు చేసి పెట్టింది. డిస్టిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో ఈ చిత్రం 64 శాతానికి పైగా వసూళ్లను రాబట్టింది.

అరవిందను బీట్ చేసిన హలో గురూ
హలో గురూ ప్రేమ కోసమే గత మూడు రోజుల్లో రూ. 12.95 కోట్లు వసూలు చేయగా, అరవింద సమేత చిత్రం రూ.6.98 కోట్లు వసూలు చేసింది. ఇక విశాల్, కీర్తి సురేష్ నటించిన పందెంకోడి2 చిత్రంలో రూ.5.05 కోట్లు రాబట్టింది. ఈ రెండు చిత్రాల కలెక్షన్లను హలో గురూ ప్రేమ కోసమే కంటే మెరుగ్గా ఉండటం ఫ్యాన్స్‌లో జోష్ పెంచింది.

ఇంకా నష్టాల్లోనే హలో గురూ
గత 11 రోజుల్లో అరవింద సమేత చిత్రం రూ.150 కోట్లకుపైగా కలెక్షన్ సాధించింది. అయితే నాలుగు రోజుల్లో అరవింద సమేత చిత్రం కలెక్షన్లు కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టు తెలిసింది. పందెంకోడి2 కూడా భారీ కలెక్షన్లను సాధించడం గమనార్హం. అయితే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ.20 కోట్లకు అమ్మినట్టు సమాచారం. అయితే ఇంకా డిస్టిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే ఇంకా 9 కోట్లు సాధించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











