twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హలో గురు ప్రేమ కోసమే షాకింగ్ కలెక్షన్లు.. తొలి రోజు అంచనాలకు భిన్నంగా

    |

    ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఎనర్జిక్ స్టార్ రామ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్, ప్రణిత నటించిన హలో గురు ప్రేమ కోసమే చిత్రం తొలి రోజు పాజిటివ్ కలెక్షన్లతో ముందుకెళ్తున్నది. ఈ చిత్రంపై సినీ, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైన మొదటి రోజు మంచి వసూళ్లను సాధించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.7.2 కోట్ల వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

    నైజాంలో కలెక్షన్లు

    నైజాంలో కలెక్షన్లు

    నైజాంలో హలో గురు ప్రేమ కోసమే చిత్రాన్ని భారీ సంఖ్యలో విడుదల చేశారు. సెలవు దినం కావడంతో తొలి రోజున ఏ గ్రేడ్ సెంటర్లలో మంచి స్పందన కనిపించింది. ఈ చిత్రం నైజాంలోనే రూ. 2.45 కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు తొలి రోజే రూ.1.53 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తున్నది.

    ఆంధ్రాలో యావరేజ్‌గా

    ఆంధ్రాలో యావరేజ్‌గా

    ఇక ఆంధ్రాలో సినిమా కలెక్షన్లు యావరేజ్‌గా ఉన్నాయని తెలుస్తున్నది. ఈ చిత్రానికి వైజాగ్ లాంటి సెంటర్లలో పెద్దగా స్పందన కనిపించలేదనేది తాజా సమాచారం. ఆంధ్రాలో ఈ చిత్రం రూ.2.60 కోట్లు కలెక్షన్లు సాధించినట్టు తెలిసింది. నికరంగా రూ.1.73 కోట్లు నమోదైనట్టు సమాచారం.

    మిగితా ప్రదేశాల్లో

    మిగితా ప్రదేశాల్లో

    ఆంధ్రా, తెలంగాణలో మొత్తం కలిపి ఈ చిత్రం రూ.5.7 కోట్ల వసూళ్లు నమోదైనట్టు ప్రాథమికంగా తెలిసింది. తెలంగాణ, ఆంధ్రేతర ప్రాంతాల్లో ఈ చిత్రం మరో రూ.1.5 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    రూ.24 కోట్లకు అమ్మకం

    రూ.24 కోట్లకు అమ్మకం

    త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందించిన రొమాంటిక్ కామెడీ చిత్రానికి సంబంధించిన వరల్డ్ థ్రియేట్రికల్ రైట్స్‌ను 24 కోట్లకు అమ్మినట్టు ప్రచారం జరిగింది. వారాంతంలో అన్ని సెలవులు కాబట్టి మరింత మెరుగైన కలెక్షన్లను రాబట్టే అవకాశం లేకపోలేదు. కానీ ఈ చిత్రం రూ.24 కోట్లు వసూలు చేస్తుందా అనే విషయంపై ట్రేడ్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.

    English summary
    Hello Guru Prema Kosame is set to release this Dussehra. Ram and Anupama Parameshwaran are the lead pair. The film is directed by Trinadha Rao Nakkina of Cinema Choopistha Mama and Nenu Local. The film also has Pranitha as another female actress. Prakash Raj appears in a key role. Music is by Devi Sri Prasad and songs are pretty ordinary. Dil Raju is producing this romantic drama that releases on October 18.The film has been cleared by Censor Board with no cuts and has obtained U Certificate. Hello Guru Prema Kosame grossed Rs 7.2 crore at the worldwide box office. The distributors' share is estimated to be Rs 4.25 crore on the opening day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X