For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు రాష్ట్రాల్లో ‘హలో’ పరిస్థితేంటి? ఈసారి కొడతాడా..?

    By Bojja Kumar
    |

    అక్కినేని స్టార్ అఖిల్ నటించిన 'హలో' మూవీ ఈ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. 'మనం' ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వం, స్వయంగా నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించడం, అక్కినేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కలిసి సినిమాను ప్రమోట్ చేయడంతో విడుదల ముందే నుండే మంచి అంచనాలు బావున్నాయి. మరి బాక్సాఫీసు వద్ద 'హలో' పరిస్థితి ఏమిటి? తొలి సినిమాతో ప్లాప్ అయిన అఖిల్ ఈ సినిమాతో అయినా హిట్ట కొట్టే అవకాశం ఉందా? అంటే అవుననే అంటున్నాయి బాక్సాఫీసు ఫలితాలు.

    HELLO Movie Public Talk
     తొలి రోజు కలెక్షన్ ఎంత?

    తొలి రోజు కలెక్షన్ ఎంత?

    ‘హలో' సినిమా తొలి రోజు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. అయితే మరీ తీసేసినట్లు కూడా లేదు. డీసెంట్ కలెక్షన్ సాధించిందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 4.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో రూ. 2.7 కోట్ల షేర్ వచ్చింది. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనే దానిపై సినిమా హిట్టో ఫట్టో తేలిపోతుంది.

     యూఎస్ఏలో

    యూఎస్ఏలో

    యూఎస్ఏలో ఈ చిత్రం ప్రీమియర్ షోలతో కలిసి తొలి రోజు $375k వసూలు చేసింది. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకుడు కావడం వల్లే ఇంత కలెక్షన్ వచ్చిందని అంటున్నారు.

    రివ్యూలు ఎలా ఉన్నాయి

    రివ్యూలు ఎలా ఉన్నాయి

    అయితే సినీ విమర్శకుల నుండి ఈ చిత్రానికి ఎబో యావరేజ్ రేటింగ్సే వచ్చాయి. సినిమా మేకింగ్ బావున్నప్పటికీ స్టోరీ పరంగా గొప్పగా ఏమీ లేదని, అయితే దర్శకుడు తెరపై ఎమోషన్స్ చూపించిన తీరు బావుందనే కామెంట్స్ వచ్చాయి.

     ఏరియా వైజ్ షేర్

    ఏరియా వైజ్ షేర్

    ‘హలో' మూవీ తొలి రోజు నైజాం ఏరియాలో రూ. 90 లక్షలు, సీడెడ్ ఏరియాలో రూ. 45 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 33 లక్షలు, గుంటూరులో 40 లక్షలు, కృష్ణలో 22 లక్షలు, ఈస్ట్ లో 18 లక్షలు, వెస్ట్ లో 13 లక్షలు, నెల్లూరులో 9 లక్షల షేర్ రాబట్టింది.

     కలిసొచ్చిన హాలిడే సీజన్

    కలిసొచ్చిన హాలిడే సీజన్

    హలో మూవీకి ఈ క్రిస్మస్ సీజన్ బాగా కలిసొచ్చింది. వరుసగా హిలిడేస్ రావడం, న్యూఇయర్ కూడా కలిసి రావడంతో ఫ్యామిలీ ప్రేక్షకుల తాకిడి పెరిగింది. ఇది సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా బడ్జెట్ కూడా తక్కువే కాబట్టి ఈ సారి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    English summary
    Hello movie 1st day Collections details out. The Gross is about Rs 4.2 crore and Share is up to 2.7 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X