‘హలో’... ఎంత వసూలైంది? లాభాల్లోకి రావాలంటే ఇంకెంత?
Recommended Video

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన 'హలో' మూవీ క్రిస్మస్ సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా చూసిన సగటు ప్రేక్షకుడి నుండి సినిమా గొప్పగా ఉంది అనే ప్రశంసలు గానీ, చెత్తగా ఉందనే విమర్శలగానీ రావడం లేదు. జస్ట్ ఓకే... టైమ్ పాస్ మూవీ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా బాక్సాఫీసు వద్ద వారం రోజులు పూర్తి చేసుకుంది. మరి వసూళ్ల పరిస్థితి ఏమిటి? ఇప్పటి వరకు ఎంత రాబట్టింది? లాభాలు వచ్చే పరిస్థితి ఉందా? లేదా? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

తొలివారం షేర్ ఎంత?
బాక్సాఫీసు వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘హలో' మూవీ తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.7 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఇందులో రూ. 11 కోట్ల షేర్ తెలుగు రాష్ట్రాల నుండే వసూలైంది.

సినిమా రైట్స్ ఎంతకు అమ్మారు?
‘హలో' మూవీ థియేట్రికల్ రైట్స్ నైజాం, ఆంధ్ర, సీడెడ్, ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలకు కలిపి మొత్తం రూ. 32 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ సినిమా కావడం, అఖిల్ సినిమాపై జనాల్లో కాస్త క్రేజ్ ఉండటంతో ఇంత భారీ మొత్తానికి రైట్స్ అమ్ముడయ్యాయి,

ఇంకా ఎంత రావాలి?
‘హలో' మరో 16 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ పాయింటుకు చేరుకుంటుంది. అంతకు మించి వసూలు చేస్తే..... డిస్ట్రిబ్యూటర్లు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అయితే సంక్రాంతి సినిమాలు విడుదలవ్వడానికి మరో 12 రోజులు ఉండటంతో రికవరీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అఖిల్ తొలి మూవీతో పోల్చితే.... ఈ చిత్రం బిజినెస్ పరంగా, వసూళ్ల పరంగా బెటర్ అని చెప్పొచ్చు.

హలో
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హలో' చిత్రం ఈ నెల 22న విడుదలైంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో నాగార్జున నిర్మించారు. సినిమాకు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఓపెనింగ్స్ బాగా వచ్చి ఉంటే.... పరిస్థితి మరోలా ఉండేది. మరి ‘హలో' చివరకు లాభాలు మిగులుస్తుందా? నష్టాలు మిగిలుస్తుందా? అనేది త్వరలో తేలనుంది.

అఖిల్ నెక్ట్స్ మూవీ 10వ తేదీన
తన తర్వాతి సినిమాను ఎవరి దర్శకత్వంలో చేస్తాననే విషయం జనవరి 10న ప్రకటిస్తానని అఖిల్ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి వరకు అభిమానులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











