twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HIT 2: అడివి శేష్ కు మహేష్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చిన నాని.. కెరీర్ లో బిగ్ పేమెంట్!

    |

    తెలుగు చిత్ర పరిశ్రమంలో మంచి టాలెంట్ తో డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరోల్లో అడివి శేష్ ఒకరు. ఆయన ఇటీవల కాలంలో వరుస విజయాలతో తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు హిట్ 2 సెకండ్ కేస్ అంటూ మరొక సరికొత్త సినిమాతో ఆకట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమా కోసం అడివి శేష్ ఏ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక అతను మొత్తంగా కెరీర్లో ఇప్పటివరకు అత్యధిక రెమ్యునరేషన్ ఈ సినిమాకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    హీరోగానే కాకుండా..

    హీరోగానే కాకుండా..

    హీరో అడివి శేష్ మొదట హీరోగా చేసి మళ్ళీ ఆ తర్వాత నెగటివ్ రోల్స్ లో కూడా కనిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజా సినిమా తర్వాత అతనికి మంచి క్రేజ్ దక్కింది. ఆ తర్వాత మళ్లీ విలన్ రోల్స్ చేయకుండా క్షణం అనే సినిమాతో మంచి టాలెంటెడ్ హీరోగా గుర్తింపు అందుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా తన సినిమాలకు రైటర్ గా కూడా వర్క్ చేసుకుంటూ వెళుతూ సినిమా విజయాలలో కీళ్లపాత్ర పోషించాడు.

     నిర్మాతలకు లాభాలు

    నిర్మాతలకు లాభాలు

    ఇక ఇటీవల కాలంలో అయితే అడివి శేష్ కు వరుస విజయాలు దక్కుతున్నాయి. అతను నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటున్నాయి. ఇక చివరిగా మహేష్ బాబు ప్రొడక్షన్ లో అతను మేజర్ సినిమా చేసిన విషయం. తెలిసింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా మంచి లాభాలను అందించింది. ముఖ్యంగా మహేష్ కూడా నిర్మాతగా మంచి లాభాలు పొందాడు.

    నాని నిర్మాతగా హిట్ 2

    నాని నిర్మాతగా హిట్ 2

    ఇక అడివి శేష్ ఇప్పుడు హిట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ రెండవ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు కూడా మంచు రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటుంది అని కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించగా నాని నిర్మాతగా వ్యవహరిం

    మహేష్ ఎంత ఇచ్చాడు?

    మహేష్ ఎంత ఇచ్చాడు?

    ఇక నాని నిర్మించిన ఈ సినిమాకు హీరో అడివి శేష్ ఎంత పారితోషికం అందుకున్నాడు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందు మేజర్ సినిమాకు అడివి శేష్ మహేష్ బాబును జిఎంబి ప్రొడక్షన్స్ నుంచి 4 కోట్ల రేంజ్ లో అయితే రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా సక్సెస్ కావడంతో అడివి శేష్ ఒకసారిగా తన రెమ్యునరేషన్ పెంచేసాడు.

    నాని ఎంత ఇచ్చాడంటే..

    నాని ఎంత ఇచ్చాడంటే..

    ఇక హిట్ 2 సినిమాకు నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ నుంచి అడివి శేష్ అత్యధిక పారితోషికాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 5 కోట్ల నుంచి 6 కోట్ల మధ్యలో అతనికి రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. అడివి శేష్ చేసిన గత ఐదు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ అయితే అందించాయి. ఇప్పుడు హిట్ 2 సినిమా కూడా మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని అనిపిస్తోంది. మరి ఈ సినిమా సక్సెస్ అయితే అడివి శేష్ తన రెమ్యునరేషన్ ను ఇంకా ఎంత పెంచుతాడో చూడాలి.

    English summary
    Hero Adivi sesh shocking remuneration for hit movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X