Ramarao On Duty నష్టాలపాలైన నిర్మాతకు రవితేజ అండగా.. ఎంత తిరిగి ఇచ్చాడంటే?
మాస్ మహారాజ రవితేజ మరోసారి వరుస అపజయాలతో బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను అందుకుంటున్నాడు. గత ఏడాది క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు అని అనుకున్న సమయంలో మళ్లీ వెంటనే మరో సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా తీవ్రంగా నష్టాలను కలిగించింది. అయితే రవితేజ సినిమా నష్టాల బారిన పడడంతో నిర్మాత కు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. కొంత డబ్బును కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్లు సమాచారం. రవితేజ ఎంత తిరిగి ఇచ్చాడు అనే వివరాల్లోకి వెళితే...

దారుణంగా..
ఒకప్పుడు మాస్ మహారాజా రవితేజ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చేవి. కానీ మారుతున్న కాలంలో అగ్రహీరోల సినిమాలను కూడా దారుణంగా దెబ్బతీస్తున్నాయి. అసలు ఊహించని విధంగా పెద్ద సినిమాలు కూడా రెండు మూడు రోజులకే థియేటర్ నుంచి వెళ్ళి పోతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

నెగిటివ్ టాక్ రావడంతో..
అయితే రవితేజ ఇటీవల నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదలకు ముందు కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసినప్పటికీ విడుదల తర్వాత మాత్రం దారుణమైన కలెక్షన్స్ అందుకుంది. మొదటి రోజే ఈ సినిమాకు భారీ స్థాయిలో నెగటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల్లో రెండవ రోజు మళ్ళీ థియేటర్ల వైపు చూసింది లేదు. నిజానికి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుంది అని ఎవరూ ఊహించలేదు.

భారీ నష్టాల దిశగా రామారావు
అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమాను నిర్మించిన నిర్మాతకు భారీ స్థాయిలో నష్టాలు కలిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను కొనేందుకు కూడా బయ్యర్లు ముందుకు రాకపోవడంతో చాలా ఏరియాల్లో నిర్మాత సొంతంగా విడుదల చేసుకోవాల్సి వచ్చింది. దాదాపు 18 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ టైం లో అయితే 13 కోట్ల వరకు నష్టాలను కలిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇచ్చిన మాట ప్రకారం
ఇప్పటికే చాలా ఏరియాల్లో జనాలు లేక షోలో క్యాన్సల్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాకు కేవలం సుధాకర్ చెరుకూరి మాత్రమే కాకుండా రవితేజ కూడా సహనిర్మాతగా వ్యవహరించారు. దాదాపు ఈ సినిమా కోసం రవితేజ 15 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే నిర్మాతకు భారీ స్థాయిలో నష్టాలు వస్తూ ఉండటంతో ముందుగానే ఇచ్చిన మాట ప్రకారం రవితేజ కొంత డబ్బులు కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆ డబ్బు వెనక్కి ఇచ్చిన రవితేజ
దాదాపు 12 కోట్ల వరకు రవితేజ నిర్మాతకు వెనక్కి ఇచ్చినట్లు సమాచారం. ముందుగానే నిర్మాత పై ఏర్పడిన నమ్మకం రవితేజకు ఎంతో సంతోషాన్ని కలిగించిందట. రిస్కీ బడ్జెట్ అని తెలిసినప్పటికీ కూడా నమ్మకంతో మంచితనంతో నిర్మాత ఖర్చు చేయడంతో రవితేజకు ఎంతగానో కనెక్ట్ అయ్యాడట. అందుకే మరొక సినిమా కూడా చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తీవ్రంగా నష్టపోయిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు నెక్స్ట్ సినిమా చేసిన తక్కువ రేట్లకు ఇవ్వాలని రవితేజ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం


Click it and Unblock the Notifications











