Tiger Nageshwar Rao Collections: బాక్సాఫీస్ వద్ద టైగర్ పంజా... రవితేజ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!
దసరా కానుకగా మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ చిత్రం ఈరోజున తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. ఇక విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం.
మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ తెరకెక్కించిన మాస్ చిత్రం 'టైగర్ నాగేశ్వర్రావు'. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించగా... తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఇక ఇందులో కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. ఇక పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

టైగర్ నాగేశ్వరరావు మాస్ ఎలిమెంట్లతో రూపొందింది. 1970 కాలంలో గజగజలాడించిన స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేరుకు బయోపిక్ మూవీనే అయినా ఇందులో ఎన్నో కమర్షియల్ హంగులు జోడించి దర్శకుడు వంశీ రూపొందించాడు. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ అయితే వచ్చింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వర్రావు' చిత్ర బిజినెస్ విషయానికి వస్తే.... తెలుగు రాష్ట్రాల్లో ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 8.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.40 కోట్లు, ఆంధ్రాలో రూ. 17 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను నమోదు చేసుకుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కలిసి.. టైగర్ నాగేశ్వరరావు రూ. 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.

'టైగర్ నాగేశ్వర్రావు' వరల్డ్ వైడ్ బిజినెస్ విషయానికి వస్తే... రవితేజ కెరియర్ లోనే ఈ సినిమా భారీ బిజినెస్ నమోదు చేసుకుంది. ఈ సినిమా హక్కులు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లకు విక్రయించారు. ఇక ఓవర్సీస్ హక్కులు రూ. 3.00 కోట్లకు అమ్ముడుపోగా... ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా రూ. 37.50 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే... దాదాపు రూ. 38 కోట్లు రావాలి.
టైగర్ నాగేశ్వర రావు థియేటర్ ఆక్యూపెన్సీ విషయానికి వస్తే... మార్నింగ్ షోస్ బాగానే ఫిల్ అయ్యాయి. ఇక మధ్యాహ్నం, సాయంత్రం షోస్ కి సంబంధించి రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇక మొత్తంగా అన్ని భాషల్లో కలుపుకుని టైగర్ నాగేశ్వరరావు ఆక్యూపెన్సీ 50శాతం ఫిల్ అయినట్లు తెలుస్తోంది.

ఇక టైగర్ నాగేశ్వర రావు సినిమా మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.8 కోట్లు వసూలు చేసిందని ట్రెడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఇక ఇండియా వైడ్ అన్ని భాషల్లో కలుపుకుని ఈ సినిమా రూ.10 కోట్ల నెట్ సాధించిందని అంచనా. ఇక ఓవర్సీస్, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కలుపుకుని చూస్తే.. ఈ సినిమా మొదటి రోజు రూ.15 నుంచి రూ.17 కోట్లు సాధించవచ్చని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ సినిమా ఇదే రేంజులో పోతే.. మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కొట్టడం ఖాయం.


Click it and Unblock the Notifications











