పాన్ ఇండియా మోసం.. పుష్ప కలెక్షన్లపై పరోక్షంగా ట్రోల్ చేసిన హీరో సిద్దార్థ్

సీనియర్ స్టార్ హీరో సిద్ధార్థ ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంట్రవర్సీ విషయాలపై కూడా చాలా తెలివిగా స్పందిస్తున్నారు. ఇక తనపై విమర్శలు చేస్తున్న వారికి కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్న బాక్సాఫీస్ కలెక్షన్స్ పై కూడా సిద్ధార్థ పరోక్షంగా కామెంట్ చేయడం చర్చనీయాంశం గా మారింది. అది కూడా పుష్ప సినిమాకు కౌంటర్ గా సిద్ధార్థ కామెంట్ చేసినట్లుగా అర్థమవుతుంది.

200కోట్లకు పైగా..

200కోట్లకు పైగా..

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఏ స్థాయిలో టాక్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ పై అనేక రకాల కామెంట్స్ అయితే వెలువడుతున్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ పై చిత్రయూనిట్ కూడా అధికారికంగా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపు రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలియజేశారు.

సిద్దార్థ్ కాంట్రవర్సీ ట్వీట్

సిద్దార్థ్ కాంట్రవర్సీ ట్వీట్

ఇక ప్రస్తుతం పుష్ప సినిమా కలెక్షన్స్ పై కూడా మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ట్రేడ్ వర్గాలు కూడా అవే చెబుతున్నాయి. అయితే నిర్మాతలు మీడియా కూడా కలెక్షన్స్ విషయంలో నిజాయితీగా లేరు అని సిద్ధార్థ ఊహించని విధంగా కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒక విధంగా ఒక వర్గం వారు సిద్దార్ద ట్వీట్ పై మద్దతు ఇస్తున్నప్పట్టికి మరికొందరు మాత్రం కౌంటర్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు.

పాన్ ఇండియా మోసం అంటూ

పాన్ ఇండియా మోసం అంటూ

సిద్ధార్థ తన ట్విట్టర్ ద్వారా ఈ విధంగా స్పందించాడు..సినిమాల కలెక్షన్ రిపోర్టులను ఫడ్జింగ్ చేయడానికి ఈ రోజుల్లో కమీషన్ లేదా రేటు ఎంత?. నిర్మాతలు చాలా కాలంగా బాక్సాఫీస్ లెక్కల గురించి అబద్ధాలు చెబుతున్నారు... ఇప్పుడు ట్రేడ్ వర్గాలు మరియు మీడియా వారు కూడా వారు చెప్పినట్లు గణాంకాలను చెబుతున్నాయి... అన్ని భాషలు, అన్ని పరిశ్రమలు.. ఒకేలా ఉన్నాయి. ఇది పాన్ ఇండియా మోసం.. అని సిద్దార్థ్ వివరణ చ్చారు.

స్టైలిష్ ఫ్యాన్స్ అప్సెట్

స్టైలిష్ ఫ్యాన్స్ అప్సెట్

సిద్ధార్థ చేసిన ట్వీట్ ను చూస్తూ ఉంటే ఇటీవల పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప సినిమాపై పరోక్షంగా కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సిద్ధార్థ ఇలా ఎందుకు అల్లు అర్జున్ సినిమాపై కామెంట్స్ చేస్తున్నాడు అంటూ స్టైలిష్ స్టార్ అభిమానులు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

పుష్పపై ట్రోల్స్

పుష్పపై ట్రోల్స్

రీసెంట్ గా సినిమా సక్సెస్ మీట్ లో కూడా సీనియర్ యాంకర్ ఉదయభాను కూడా పొరపాటున చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప సినిమా 203 కోట్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోగా.. పొరపాటున 2003 కోట్లు సాధించింది అని చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా గట్టిగానే వెలువడుతున్నాయి. ఇక ఈ తరుణంలో సిద్ధార్థ్ కూడా అదే తరహాలో ట్రోలింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X