టాలీవుడ్ : హీరో ఆఫ్‌ ది 2013 ఎవరు? (ఫోటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్ : 2013 వెళ్లిపోయింది. 2014 ఉత్సాహంగా వచ్చేసింది. మరి 2013 లో హీరో ఆఫ్ ది ఇయిర్ ఎవరు అనేదే పెద్ద క్వచ్చిన్. అయితే అందరూ ఒప్పుకునే ఏకైక మాట.. 'పవన్‌కల్యాణ్‌'. ఆయనే హీరో ఆఫ్ ది ఇయిర్ గా నిలిచారు. ఆయన క్రేజ్,కలెక్షన్స్ రూపంలో ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. మరో ప్రక్క సంవత్సరం చివర్లో పవన్ ..మూడో వివాహం వార్తల్లో కి వచ్చి సంచలనం రేపింది. ఎటు చూసినా 2013 మొత్తం..పవన్ కళ్యాణ్ వార్తలే.

2013లో మొత్తం 174 తెలుగు సినిమాలు విడుదలైతే... 'అత్తారింటికి దారేది' చిత్రం నెంబర్‌వన్‌గా నిలిచింది. అమెరికాలో మన కరెన్సీపరంగా చూస్తే సుమారు రూ: 12 కోట్లు వసూళ్లు దక్కాయి.

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌... ఇలా వేదిక ఏదైనా సరే. సినీ ప్రేమికులు గుమ్ముగూడితే అక్కడ... ఒకటే టాపిక్‌. తెలుగు చిత్రసీమలో నెం.1 కథానాయకుడు ఎవరనే. మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్‌లపైనే పోటీ నడుస్తోంది. 'అత్తారింటికి దారేది' సినిమాతో పవన్‌ సంచలనం రేపితే, వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సృష్టించాడు మహేష్‌బాబు. 'అత్తారింటికి...' వంద కోట్ల మైలురాయికి చేరువలో ఉంది.

'దూకుడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇలా మూడు విజయాలతో మహేష్‌ తన దూకుడు చూపిస్తున్నారు. ఈ యేడాది అతి పెద్ద హిట్‌ మాత్రం.. 'అత్తారింటికి..'నే. దాంతో పవన్‌ అభిమానులు తమ హీరోనే నెంబర్‌ వన్‌ అంటున్నారు. మహేష్‌ ఫ్యాన్స్‌ మాత్రం... 'హ్యాట్రిక్‌ విజయాలు' గుర్తుచేస్తున్నారు.

మిగతా విశేషాలు స్లైడ్ షోలో...

ప్రూవ్ అయ్యింది...

ప్రూవ్ అయ్యింది...

కథలో దమ్ముంటే ఇంకేం అక్కర్లెద్దు. కానీ స్టార్లను తక్కువ అంచనా వేయకూడదు. ఓమాదిరి సినిమా అయినా సరే - సూపర్‌ హిట్‌గా మార్చేసత్తా వారికి ఉంది. అది 'అత్తారింటికి దారేది' తో ప్రూవ్ అయ్యింది.

అన్నిటికన్నా ముఖ్యంగా...

అన్నిటికన్నా ముఖ్యంగా...

'అత్తారింటికి దారేది' చిత్రం ఎలాంటి పరి స్థితుల మధ్య విడుదలైంది? ఎంతటి విజయం అందుకొన్నంది? అనే విషయాలే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఫస్టాఫ్ సినిమా బయటికొచ్చినా సరే... మిగతా సగభాగం ఎలాంటి పవన్‌ మేజిక్‌ ఎలా ఉంటుందో అంటూ జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. అందుకే ఆ చిత్రం అంతటి సంచలనాన్ని సృష్టించింది.

వసూళ్లతో సునామీనే...

వసూళ్లతో సునామీనే...

ఇక హిట్టు సినిమా ఇస్తే మాత్రం పవన్ ఎవరికీ దొరకడు. వసూళ్లతో సునామీనే సృష్టిస్తాడు. అందుకు 'గబ్బర్‌సింగ్‌', 'అత్తారింటికి దారేది'లాంటి సినిమాలే ఉదాహరణ. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమాలు సృష్టించిన సందడి అంతా ఇంతా కాదు.

అక్కడ కూడా...

అక్కడ కూడా...


అమెరికాలో కూడా థియేటర్ల దగ్గర పవన్ సినిమాలకు హౌస్‌ఫుల్‌ బోర్డులు వేలాడాయి. రికార్డులు వాటి ముందు ఆల్‌టైమ్‌ అని ప్రత్యేకంగా రాసుకొన్నాయి. ఇక సొంతగడ్డపై అయితే... మల్టీప్లెక్స్‌లు, టూరింగు టాకీసులు అన్నీ ఫుల్లయిపోయాయి. క్లాసూ మాసూ అనే తేడా లేకుండా సినిమాకి బ్రహ్మరథం పట్టారు.

రెండో గబ్బర్‌ సింగ్

రెండో గబ్బర్‌ సింగ్

ఇప్పుడందరి చూపూ 'గబ్బర్‌సింగ్‌ 2' సినిమాపైనే. 'అత్తారింటికి దారేది' సంచలన విజయం సాధించడంతో 'గబ్బర్‌సింగ్‌ 2'పై భారీ అంచనాలు నెల కొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. కథ, కథనాల విషయంలో సుదీర్ఘమైన కసరత్తులు జరిగినట్టు అర్థమవుతోంది.

ఈ సారి కలం కూడా...

ఈ సారి కలం కూడా...

'గబ్బర్‌సింగ్‌ 2' సినిమాకోసం పవన్ కలం కూడా చేతపట్టారని తెలిసింది. చాలావరకు సంభాషణలు సొంతంగానే రాసుకొన్నారని సమాచారం. పవన్‌కల్యాణ్‌ స్వయంగా కథా చర్చల్లో పాల్గొని బృందాన్ని ముందుకు నడిపించినట్టు సమాచారం.

చంబల్‌లోయ ఇన్‌స్పెక్టర్‌గా...

చంబల్‌లోయ ఇన్‌స్పెక్టర్‌గా...

త్వరలోనే ఛంబల్‌లోయలో 'గబ్బర్‌సింగ్‌ 2' ఆరంభమవుతుంది. ఇందులో ఆయన చంబల్‌లోయ ఇన్‌స్పెక్టర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా సంపత్ నంది ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు.

రెండు చిత్రాలు...

రెండు చిత్రాలు...

త్వరలోనే 'గబ్బర్‌సింగ్‌ 2' కి హీరోయిన్ తో పాటు, సినిమా షెడ్యూళ్లని ప్రకటించే అవకాశాలున్నాయి. 2013 హీరోగా సత్తాని చాటిన పవన్‌కల్యాణ్‌ 2014లోనూ అదే స్థాయిలో అలరిస్తారేమో చూడాలి. ఈ యేడాది పవన్‌కల్యాణ్‌ నుంచి రెండు చిత్రాలు వచ్చే అవకాశాలున్నాయి.

ఫోర్భ్న్‌ పత్రిక ప్రకారం కూడా...

ఫోర్భ్న్‌ పత్రిక ప్రకారం కూడా...

ఫోర్భ్న్‌ పత్రిక ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం మహేష్‌ కంటే పవన్‌ కల్యాణే ముందున్నాడు. సంపాదనలో, పారితోషికంలో, పేరు ప్రఖ్యాతుల్లో.. అన్నిటా టాలీవుడ్‌లో నెం.1 స్థానం పవన్‌ కల్యాణ్‌కే ఇచ్చారు. పవన్‌ ఈ యేడాది రూ.57 కోట్లు సంపాదించాడట. ఇది పారితోషికం రూపంలో. మహేష్‌ మాత్రం 29 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. అయితే ఈ గణాంకాల సేకరణలో దోషాలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మరో స్టార్ హీరో నాగార్జున ఈ లెక్కల్ని తప్పుబట్టారు. సరైన రీతిలో మదింపు జరపలేదనేది ఆయన ఆరోపణ.

మ్యాజిక్...

మ్యాజిక్...

''మీలో ఏదో మేజిక్‌ ఉంది సిద్ధుగారూ...!'' - 'అత్తారింటికి దారేది'లో పవన్‌కల్యాణ్‌తో ప్రణీత చెప్పే సంభాషణ ఇది. నిజమే... ప్రణీత చెప్పినట్టు పవన్‌లో ఏదో మేజిక్‌ ఉంది. ఓ మాదిరి సినిమా తీసిచ్చినా... దాన్ని విజయతీరాలకు చేరుస్తాడు. అది ఈ సంవత్సరం వచ్చిన పవన్ చిత్రాలు మరోసారి ప్రూవ్ చేసాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X