twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన సినిమా రీమేక్ కుమ్మేస్తోంది

    By Srikanya
    |

    ముంబై: ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలు రీమేకులు చేయటం పరిశ్రమకు కొత్తేం కాదు. తాజాగా అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన 'పరుగు' సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని రీసెంట్ గా హిందీ లో రీమేక్‌ చేసారు. 'హీరోపంతి' పేరుతో ఈ సినిమాని సాజిద్ నదియడ్‌వాలా నిర్మించారు. ఈ చిత్రంతో తో బాలీవుడ్‌ టైగర్ ష్రాఫ్ (జాకీ ష్రాఫ్ కుమారుడు) పరిచయమయ్యారు. రిలీజ్ కు ముందు నుంచి సినిమాపై నెగిటివ్ టాక్ నడుస్తోంది. అయితే రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా హిట్ టాక్ మొదలైంది. కలెక్షన్స్ చాలా బాగున్నాయని కొనుక్కున్నవాళ్లు సంతోషపడుతున్నారు.

    'Heropanti' Leads BO in Week

    రూ. 25 కోట్ల వ్యయంతో తయారైన ఈ సినిమా మొదటి పది రోజుల్లోనే రూ. 44.20 కోట్ల (నెట్)ను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ వసూళ్లు కేవలం భారతీయ మార్కెట్‌కు సంబంధించినవి మాత్రమే. ఓవర్సీస్ కలెక్షన్లు, శాటిలైట్ హక్కులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సినిమా నిర్మాతకూ, డిస్ట్రిబ్యూటర్లకూ లాభాల పంటను పండించినట్లే. ఈ కలెక్షన్లు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

    సినిమా విడుదలకు ముందు ప్రోమోస్‌లో టైగర్ కనిపించిన తీరు పట్ల జోకులు వచ్చాయి. చాలామంది ఈ సినిమా ఫ్లాపవడం ఖాయమన్నారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా అనూహ్యమైన వసూళ్లను సాధిస్తుంటే, హీరో హీరోయిన్లుగా నటించిన టైగర్, కృతి సనన్('1.. నేనొక్కడినే' ఫేమ్)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా టైగర్ నటన, అతని డాన్సులు, ఫైట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

    English summary
    
 Tiger Shroff's "Heropanti" is leading the box office in its second week, while the new releases "Citylights" and "Kuku Mathur Ki Jhand Ho Gayi" has opened to very poor response in India. The film which marks the debut of Shroff and Kriti Sanon has opened the second week on a steady note.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X