Hey Balwanth Closing Collections: హే బలవంత్ క్లోజింగ్ కలెక్షన్లు... సుహాస్ మూవీకి లాభమా? నష్టమా?
సుహాస్, శివానీ నాగారం హీరో హీరోయిన్లుగా గోపీ అచ్చెర దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ హే బలవంత్. తొలుత ఈ మూవీ పేరును హే బలవంత్‌గా అనుకున్నారు. అయితే సెన్సార్ బోర్డ్ సూచన మేరకు బలవంత్ అని టైటిల్‌ను ఖరారు చేశారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ నరేంద్ర రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇంకా ఈ చిత్రంలో వీకే నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, అన్నపూర్ణమ్మ, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీత దర్శకత్వం వహించగా.. మహీరెడ్డి పాండుగుల సినిమాటోగ్రాఫర్‌గా, విప్లవ్ నైషదం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఫిబ్రవరి 20వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో హే బలవంత్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? హే బలవంత్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? సుహాస్ మూవీకి లాభమెంత? నష్టమెంత? అనేది పరిశీలిస్తే...
హే బలవంత్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి హే బలవంత్ మూవీకి 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సుహాస్ ట్రాక్ రికార్డ్, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా హే బలవంత్ మూవీపై చిత్ర పరిశ్రమలో హైప్ నెలకొంది. దానికి తగినట్లుగానే ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు.

హే బలవంత్ ప్రీ రిలీజ్ బిజినెస్
హే బలవంత్ మూవీ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ 5 సంస్థలు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి 8 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సుహాస్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 9 కోట్ల రూపాయల షేర్.. 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రావాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. హే బలవంత్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్‌లోనూ, ఓవర్సీస్‌లో 300 థియేటర్స్ చొప్పున వరల్డ్ వైడ్‌గా 750 థియేటర్స్‌లో విడుదల చేశారు.
హే బలవంత్ కలెక్షన్స్
సుహాస్ మూవీకి తొలిరోజున 95 లక్షల రూపాయలు, రెండో రోజున 1.1 కోట్ల రూపాయలు, మూడో రోజున కోటి రూపాయలు, నాలుగో రోజున 55 లక్షల రూపాయలు, ఐదో రోజున 45 లక్షల రూపాయలు, ఆరో రోజున 35 లక్షల రూపాయలు, ఏడో రోజున 34 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 11 లక్షల రూపాయలు వసూలైంది. మొత్తంగా ఇండియాలో ఇప్పటి వరకు 4.85 కోట్ల రూపాయల నెట్... 5.27 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు సాక్‌నిక్ తెలిపింది.
హే బలవంత్ ఓవర్సీస్ కలెక్షన్స్
సుహాస్ మూవీ ఓవర్సీస్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ప్రీమియర్స్ నుంచి నేటి వరకు ఈ చిత్రానికి విదేశాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో 2 లక్షల డాలర్లు (1.82 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో ఈ సినిమాకు మరో 30 లక్షల రూపాయల వరకు కలెక్ట్ చేసింది. మొత్తంగా ఓవర్సీస్ నుంచి హే బలవంత్ మూవీకి 2.30 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి సుహాస్ మూవీ వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
హే బలవంత్‌కు లాభమెంత? నష్టమెంత?
గత వారం ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో పాటు పాజిటివ్ రివ్యూలు, మిక్స్‌డ్ టాక్ కారణంగా హే బలవంత్ మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మెరుగైన కలెక్షన్స్ వచ్చాయి. అన్నింటిలోకి నార్త్ అమెరికాలో సుహాస్ ప్రభావం చూపించాడు. వీకెండ్ వరకు సత్తా చాటిన ఈ చిత్రం.. సోమవారం నుంచి క్రమంగా కలెక్షన్స్ కోల్పోయింది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ ప్రారంభం కావడంతో దాని ప్రభావం గట్టిగా పడింది. ఈ శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్‌లో విడుదల కావడంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.


Click it and Unblock the Notifications











