Hey Balwanth Day 1 Collections: హే బలవంత్‌కు డీసెంట్ కలెక్షన్స్... సుహాస్ మూవీకి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు యంగ్ హీరో సుహాస్. ఏడాదికి ఖచ్చితంగా రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు సుహాస్. ఆయన తాజాగా నటించిన మూవీ హే బలవంత్. యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ఈ సినిమాకు ఫిబ్రవరి 19వ తేదీన ప్రీమియర్స్ పడ్డాయి. ఈ నేపథ్యంలో హే బలవంత్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు సుహాస్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది అనేది పరిశీలిస్తే..
హే బలవంత్ తారాగణం
త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ నరేంద్ర రెడ్డి ఈ హే బలవంత్ సినిమాను నిర్మించగా.. గోపీ అచ్చెర దర్శకత్వం వహించారు. హే బల్వంత్‌లో లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివానీ నాగారం హీరోయిన్‌గా నటిస్తుండగా.. వీకే నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, అన్నపూర్ణమ్మ, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. మహీరెడ్డి పాండుగుల సినిమాటోగ్రాఫర్‌గా, విప్లవ్ నైషదం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు

హే బలవంత్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి హే బల్వంత్ మూవీకి 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీపడకుండా హే బలవంత్ చిత్రాన్ని నిర్మించారు మేకర్స్. సుహాస్ ట్రాక్ రికార్డ్, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా హే బలవంత్ మూవీపై చిత్ర పరిశ్రమలో హైప్ నెలకొంది. దానికి తగినట్లుగానే ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
హే బలవంత్ ప్రీ రిలీజ్ బిజినెస్
ఫిలింనగర్ వర్గాల చెబుతున్న ప్రకారం హే బలవంత్ మూవీ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ 5 సంస్థలు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నాయి. అయితే ఆ డీల్ వాల్యూ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి 8 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో హే బలవంత్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని విశ్లేషకులు వాల్యూ కట్టారు. సుహాస్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్‌లోనూ, ఓవర్సీస్‌లో 300 థియేటర్స్ చొప్పున వరల్డ్ వైడ్‌గా 750 థియేటర్స్‌లో విడుదల చేశారు.
హే బలవంత్ ఓవర్సీస్ కలెక్షన్స్
ప్రీమియర్స్‌కు ముందే ఓవర్సీస్‌లో సుహాస్ మూవీకి మంచి రెస్పాన్స్ నమోదైంది. వీకెండ్ వరకు అడ్వాన్స్ బుకింగ్‌లో హే బల్వంత్ మూవీకి మంచి బుకింగ్స్ నమోదైనట్లు ఈ సినిమాకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోన్న అథర్వ భద్రకాళీ ఫిలింస్ తెలిపింది. ఇప్పటి వరకు అందుతున్న సమచారం ప్రకారం హే బలవంత్ మూవీకి ఓవర్సీస్‌లో 71,777 డాలర్లు (భారత కరెన్సీలో 65.31 లక్షల రూపాయలు) రాబట్టిందట. తొలి రోజు టాక్‌ను బట్టి ఇది త్వరలోనే లక్ష డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
హే బలవంత్ తొలిరోజు కలెక్షన్స్
సుహాస్ సినిమాల ఇటీవల పర్ఫార్మెన్స్ నేపథ్యంలో హే బలవంత్‌పైనా ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఈ సినిమాకు తొలిరోజున మధ్యాహ్నం 2 గంటల వరకు 18 శాతం మేరక థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు కాగా.. ఫస్ట్ షో, సెకండ్ షోలతో కలుపుకుని అది 40 శాతం వరకు చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం హే బలవంత్ మూవీకి ఇండియాలో 40 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా సుహాస్ మూవీ తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 20 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 40 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











