Hey Balwanth Day 3 Collections: హే బలవంత్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. 3 రోజుల్లో సుహాస్ ఎన్ని కోట్లు రాబట్టాడంటే?

త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ నరేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం హే బలవంత్. సుహాస్, శివానీ నాగారం హీరో హీరోయిన్లుగా నటించారు. తొలుత ఈ సినిమాకు హే భగవాన్ అనే టైటిల్ అనుకోగా.. సెన్సార్ బోర్డ్ అభ్యంతరాల నేపథ్యంలో టైటిల్‌ను హే బలవంత్‌గా మార్చారు. గోపీ అచ్చెర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వీకే నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, అన్నపూర్ణమ్మ, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీత దర్శకత్వం వహించగా.. మహీరెడ్డి పాండుగుల సినిమాటోగ్రాఫర్‌గా, విప్లవ్ నైషదం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో హే బలవంత్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు సుహాస్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? అనేది పరిశీలిస్తే..

హే బలవంత్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి హే బల్వంత్ మూవీకి 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సుహాస్ ట్రాక్ రికార్డ్, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా హే బలవంత్‌ మూవీపై చిత్ర పరిశ్రమలో హైప్ నెలకొంది. దానికి తగినట్లుగానే ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు.

Hey Balwanth Day 3 Expected Box Office Collections Worldwide Suhas s film heading towards 10 crores

హే బలవంత్ ప్రీ రిలీజ్ బిజినెస్
హే బలవంత్ మూవీ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ 5 సంస్థలు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి 8 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో హే బలవంత్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని విశ్లేషకులు వాల్యూ కట్టారు. సుహాస్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్‌లోనూ, ఓవర్సీస్‌లో 300 థియేటర్స్‌ చొప్పున వరల్డ్ వైడ్‌గా 750 థియేటర్స్‌లో విడుదల చేశారు.

హే బలవంత్ రెండు రోజుల కలెక్షన్స్
ప్రీమియర్స్ + డే 1 కలెక్షన్స్ కలిపి సుహాస్ మూవీకి తొలిరోజున 91 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.37 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 2 కోట్ల రూపాయల నెట్.. 2.28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. పాజిటివ్ రివ్యూలు, మౌత్‌టాక్‌తో తొలిరోజును మించి రెండో రోజు కలెక్షన్స్ వచ్చాయి. అటు ఓవర్సీస్‌లో సుహాస్ మూవీకి భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో హే బలవంత్ మూవీకి 1,71,777 డాలర్లు (భారత కరెన్సీలో 1.55 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. తద్వారా ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రెండ్రోజుల్లో హే బలవంత్ మూవీ వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించినట్లు విశ్లేషకులు వెల్లడించారు.

హే బలవంత్ మూడో రోజు కలెక్షన్స్
వీకెండ్ కావడంతో పాటు పోటీలో మరో చిత్రం లేకపోవడం హే బలవంత్ మూవీకి కలిసొస్తోంది. అర్బన్ ఏరియాలతో పాటు రూరల్ ఏరియాల్లోనూ సుహాస్ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. మూడో రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు హే బలవంత్ మూవీకి ఇండియాలో 13.8 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదవ్వగా.. 577 షోలు ప్రదర్శితమైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం హే బలవంత్ మూవీకి ఇండియాలో 17 లక్షల రూపాయల నెట్ లభించింది. మూడో రోజు హే బలవంత్ మూవీకి తెలుగు రాష్ట్రాలలో 1.50 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 30 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 2.20 కోట్ల రూపాయల రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో మూడు రోజుల వరకు ఈ సినిమాకు 6.50 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X