Hey Balwanth Day 4 Collections: హే బలవంత్‌కు షాకింగ్ కలెక్షన్స్... సుహాస్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
సుహాస్, శివానీ నాగారం హీరో హీరోయిన్లుగా గోపీ అచ్చెర దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ హే బలవంత్. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ నరేంద్ర రెడ్డి నిర్మించారు. వీకే నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, అన్నపూర్ణమ్మ, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీత దర్శకత్వం వహించగా.. మహీరెడ్డి పాండుగుల సినిమాటోగ్రాఫర్‌గా, విప్లవ్ నైషదం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో హే బలవంత్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు సుహాస్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? అనేది పరిశీలిస్తే..
హే బలవంత్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి హే బల్వంత్ మూవీకి 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సుహాస్ ట్రాక్ రికార్డ్, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా హే బలవంత్ మూవీపై చిత్ర పరిశ్రమలో హైప్ నెలకొంది. దానికి తగినట్లుగానే ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు.

హే బలవంత్ ప్రీ రిలీజ్ బిజినెస్
హే బలవంత్ మూవీ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ 5 సంస్థలు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి 8 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సుహాస్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్‌లోనూ, ఓవర్సీస్‌లో 300 థియేటర్స్ చొప్పున వరల్డ్ వైడ్‌గా 750 థియేటర్స్‌లో విడుదల చేశారు.
హే బలవంత్ మూడు రోజుల కలెక్షన్స్
ప్రీమియర్స్ + డే 1 కలెక్షన్స్ కలిపి సుహాస్ మూవీకి తొలిరోజున 95 లక్షల రూపాయలు, రెండో రోజున 1.10 కోట్ల రూపాయలు, మూడో రోజున కోటి రూపాయల చొప్పున ఇండియాలో 3 కోట్ల రూపాయల నెట్.. 3.60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. హే బలవంత్ ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే... నార్త్ అమెరికాలో ఆదివారం ఒక్కరోజే 60k డాలర్లు (భారత కరెన్సీలో 55 లక్షల రూపాయలు) వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో 140k డాలర్లు (1.27 కోట్ల రూపాయలు) రాబట్టాడు సుహాస్. మొత్తంగా ఓవర్సీస్ నుంచి మూడు రోజుల్లో 2,01,777 డాలర్లు (1.83 కోట్ల రూపాయలు) రాబట్టింది ఈ చిత్రం. దాంతో ఇప్పటి వరకు భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి హే బలవంత్ మూవీ వరల్డ్ వైడ్‌గా 5.40 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుహాస్ మూవీ 5.93 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
హే బలవంత్ నాలుగో రోజు కలెక్షన్స్
నాలుగో రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ సినిమాకు 14 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. కడపటి వార్తలు అందేసరికి ఈ సినిమాకు ఇండియాలో 15 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 4వ రోజు హే బలవంత్ మూవీ వరల్డ్ వైడ్‌గా 75 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకోవడం నిర్మాతలను, డిస్టిబ్యూటర్లను ఆనందానికి గురి చేస్తున్నది.


Click it and Unblock the Notifications











