Hey Balwanth Total Collections Worldwide: హే బల్వంత్ మూవీ టోటల్ కలెక్షన్లు.. సుహాస్ మూవీకి లాభం ఎంతంటే?
టాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు సుహాస్, శివానీ నాగారం, నరేష్ విజయ్‌కృష్ణ, వెన్నెల కిషోర్, యాంకర స్రవంతి చొక్కారపు, నెల్లూరు సుదర్శన్, అజయ్ ఘోష్, హర్షవర్దన్ తదితరులు నటించిన చిత్రం హే బల్వంత్. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ నరేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా రూపొందిన ఈ చిత్రానికి గోపి ఆచంట దర్శకత్వం వహించారు. ఈ సినిమా టైటిల్‌ను హే భగవాన్ అని పెట్టారు. అయితే సెన్సార్ అభ్యంతరాల కారణంగా హే బలవంత్ అని మార్చారు.
ఫన్ డ్రైవ్, యాక్టర్ల పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వస్తున్న ఈ సినిమాకు సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. మహీ రెడ్డీ పండుగుల సినిమాటోగ్రఫి, విప్లవ్ నైషాడ ఎఢిటింగ్, ఏ రామ్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను నిర్వర్తించారు. కథను షణ్ముఖ ప్రశాంత్, మిథున్ శంకర్ రెడ్డి డైలాగ్స్ అందించారు. ఫిబ్రవరి 20వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా వచ్చిన కలెక్షన్లు ఎంత? నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? లాభం ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

కామెడీ, యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్ ఆధారంగా రూపొందిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమాను మీడియం రేంజ్ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయలతో తెరక్కించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్, పబ్లిసిటీకి మంచి స్పందన రావడంతో బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమాకు ఓటీటీ బిజినెస్ సుమారుగా 6 కోట్ల రూపాయల మేర జరిగింది అని నిర్మాత బీ నరేంద్రరెడ్డి వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ జర్నీ సానుకూలంగా మొదలైంది. ఈ చిత్రానికి ఊహించని విధంగా కలెక్షన్లను నమదు అయ్యాయి. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో కలిపి మంచి వసూళ్లను రాబట్టింది. థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా సుమారుగా 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 5 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రెవెన్యూ విషయానికి వస్తే.. మొత్తంగా 11 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాబట్టింది. నిర్మాతలకు మంచి లాభాలను వసూళ్లను సాధించి పెట్టింది అని ట్రడే్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను లాభాల బాట పట్టించి వంశీ నందిపాటి డిస్టిబ్యూటర్‌గా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











