Hi Nanna Closing Collections హాయ్ నాన్న హిట్టా? ఫట్టా? నాని మూవీకి లాభమా? నష్టమా? క్లోజింగ్ కలెక్షన్లు
నూతన సినీ నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కొత్ద దర్శకుడు శౌర్యు దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించిన చిత్రం హాయ్ నాన్న. నేచురల్ స్టార్ నాని, మృణాల్ థాకూర్ జంటగా, బాలనటి కియారా ఖన్నా, జయరాం, నాజర్, అంగద్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఓవరాల్‌గా సాధించిన కలెక్షన్లు ఎంతంటే?
చైల్డ్ సెంటిమెంట్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అంశాలుగా రూపొందిన హాయ్ నాన్న సినిమాను 65 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 28 కోట్ల రూపాయలుగా జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో 29 కోట్ల షేర్, 58 కోట్ల గ్రాస్ కలెక్షన్ల టార్గెట్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

హాయ్ నాన్న చిత్రం వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించి ప్రాంతాలా వారిగా జరిగిన అమ్మకాల గురించిన వివరాల్లోకి.. నైజాం హక్కులను 8.5 కోట్లు, సీడెడ్ హక్కులు 2.1 కోట్లు, ఆంధ్రా ఏరియా హక్కులు 9 కోట్ల రూపాయల మేర జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కుల బిజినెస్ 22 కోట్లు మేర నమోదైంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలుగా జరిగింది.

హాయ్ నాన్న సినిమాకు పాజిటివ్ రావడంతో తొలి రోజు భారీ కలెక్షన్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5.1 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1.15 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 4.25 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 10.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
హాయ్ నాన్న ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా ఇండియాలో 32 కోట్ల రూపాయలు వసూలు చేయగా, రెండోవారం 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 42 కోట్ల రూపాయలు, హిందీలో 25 లక్షలు, కర్ణాటకలో 2 కోటి రూపాయలు, తమిళనాడులో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

హాయ్ నాన్న సినిమా ఆంధ్రా, నైజాంలో 40 కోట్ల గ్రాస్ ఇండియాలో 46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 18 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 58 కోట్ల గ్రాస్ వసూళ్లకు గాను.. 65 కోట్ల వసూళ్లు రాబట్టడంతో మంచి లాభాలతో ముగిసింది.


Click it and Unblock the Notifications











