Hi Nanna Box Office Collections భారీగా పడిపోయిన హాయ్ నాన్న కలెక్షన్లు.. నాని మూవీ వసూళ్లు ఎన్ని కోట్లంటే?
తెలుగు సినిమా పరిశ్రమకు నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం హాయ్ నాన్న. చైల్డ్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో సీతారామం ఫేమ్ మృణాల్ థాకూర్, బేబీ కియారా ఖన్నా, జయరాం ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 7వ తేదీన రిలీజైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? కలెక్షన్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
వైరా క్రియేషన్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల నిర్మాతలుగా రూపొందిన హాయ్ నాన్న సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. ఈ సినిమాను అన్ని ఖర్చులతో కలిపి 65 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా రిలీజ్‌కు పాజిటివ్‌గా క్రేజ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా భారీగా బిజినెస్ జరిగింది.

హాయ్ నాన్న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో ఈ సిినమా 8.5 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సీడెడ్‌లో 2.1 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 9 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 22 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్లు, ఓవర్సీస్‌లో 5 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా మొత్తంగా 29 కోట్ల మేర వరల్డ్ వైడ్ బిజినెస్ జరిగింది.
హాయ్ నాన్న మూవీకి రిలీజ్‌కు ముందు మంచి రెస్పాన్స్ రావడంతో భారీగానే రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఆంధ్రా, తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కర్ణాటక, అమెరికా, ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమాను 800 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేయడం గమనార్హం.

ఇక హాయ్ నాన్న సినిమా క్రేజ్ భారీగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఇండియాలో 2.25 కోట్లు, ఓవర్సీస్‌లో 2 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. సుమారుగా 4.25 కోట్ల కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది.
హాయ్ నాన్న సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు సుమారుగా 5.3 కోట్ల రూపాయలు ఇండియాలో రాబట్టింది. తెలుగులో 5.1 కోట్లు, హిందీలో 10 లక్షల రూపాయలు, తమిళంలో 10 లక్షల రూపాయలు, కన్నడలో 50 లక్షలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 4.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్లంగా 10.3 కోట్ల రూపాయల రాబట్టింది.

ఇక హాయ్ నాన్న సినిమా రెండో రోజు కలెక్షనల్ వివరాల్లోకి వెళితే.. తొలి రోజు కంటే 50 శాతం కలెక్షన్లు తగ్గినట్టు తెలుస్తున్నది. రెండో రోజు 3 కోట్ల రూపాయలు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో సాధించే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో మరో 2 కోట్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాంతో ఈ సినిమా 5 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications











