Hi Nanna Collections 50 కోట్ల చేరువగా హాయ్ నాన్న.. ఇంకా ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి అంటే?
నేచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ థాకూర్ జంటగా బాల నటి కియారా ఖన్నా కీలక పాత్రలో నూతన దర్శకుడు శౌర్య దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించిన చిత్రం హాయ్ నాన్న. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్రమక్రమంగా పుంజుకొంటూ భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ సినిమా గత 5 రోజుల్లో ఏ మేరకు కలెక్షన్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..
హాయ్ నాన్న మూవీ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాను 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఏపీ, నైజాంలో 22 కోట్ల మేర ప్రపంచవ్యాప్తంగా 29 కోట్ల మేర ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 30 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

హాయ్ నాన్న తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 5 కోట్ల రూపాయలు, రెండో రోజు 4 కోట్ల రూపాయలు, మూడో రోజు 7.5 కోట్లు, నాలుగో రోజు 8 కోట్ల రూపాయలు, 5వ రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 26 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
హాయ్ నాన్న హిందీ, తమిళంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా తమిళంలో కేవలం 57 లక్షల రూపాయలు, హిందీలో 70 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ితర భాషల్లో 1.2 కోట్ల రూపాయలు రాబట్టింది.

హాయ్ నాన్న ఓవర్సీస్‌లో భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా అమెరికాలో 1.2 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మిగితా ప్రాంతాల్లో వసూళ్లు కలిపితే సుమారుగా 12 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇంకా భారీగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
హాయ్ నాన్న ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 11 కోట్ల గ్రాస్ వసూళ్లను, రెండో రోజు 6.55 కోట్లు, మూడో రోజు 10.8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను, నాలుగో రోజు 12 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

హాయ్ నాన్న సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఈ మూవీ 30 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్ణయించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 58 కోట్ల గ్రాస్ వసూళ్లు, 30 షేర్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా 5 రోజుల్లో 42 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది.


Click it and Unblock the Notifications











