Hi Nanna Collections: పరాయి గడ్డపై నాని రికార్డు.. తారక్, పవన్‌ కంటే ఎక్కువగా.. రెండో హీరోగా సంచలనం

తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు మాత్రమే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్న అతడు.. ఏమాత్రం గ్యాప్ లేకుండా మూవీలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇప్పుడు 'హాయ్ నాన్న' అనే ఫీల్ గుడ్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చేశాడు. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నాని ఈ సినిమాతో ఓ సంచలన రికార్డును అందుకున్నాడు. ఆ వివరాలు మీకోసమే!

Hi Nanna Movie Crossed 1 Million Dollar Mark in Overseas.. Nani Creates Record

హాయ్ నాన్న అంటోన్న నాని: నేచురల్ స్టార్ నాని హీరోగా.. శౌర్యూవ్ అనే దర్శకుడు తెరకెక్కించిన చిత్రమే 'హాయ్ నాన్న'. ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ఇచ్చాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రలు చేశారు.

Hi Nanna Movie Crossed 1 Million Dollar Mark in Overseas.. Nani Creates Record

భారీ రెస్పాన్స్‌.. వసూళ్లు ఫుల్: ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'హాయ్ నాన్న' మూవీ గత గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి మంచి టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు నుంచే థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం నెలకొంది. తద్వారా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి.

Hi Nanna Movie Crossed 1 Million Dollar Mark in Overseas.. Nani Creates Record

ఓవర్సీస్‌లో మరింత ఎక్కువ: మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే ఓవర్సీస్‌లో 'హాయ్ నాన్న' మూవీ సందడి మరింత ముందుగానే ప్రారంభం అయింది. అక్కడ ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ముందుగానే ఓపెన్ అయ్యాయి. దీనికితోడు నాని అభిమానులు ఈ చిత్రం కోసం ముందు నుంచే ఆసక్తిని చూపించారు. దీంతో యూఎస్ సహా ఎన్నారైలు ఎక్కువున్న దేశాల్లో మరింత ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది.

మూడు రోజుల్లో ఆ మార్క్ చేరి: ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ నుంచి మంచి వసూళ్లను రాబట్టుకుంటోన్న 'హాయ్ నాన్న' మూవీ.. మూడో రోజు మాత్రం భారీ స్థాయిలో స్పందననే అందుకుంది. ఫలితంగా శనివారం ఈ చిత్రానికి విదేశాల్లో అత్యధిక వసూళ్లు వచ్చాయి. ఇలా ఈ చిత్రం అప్పుడే అక్కడ 1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. తద్వారా ఈ మార్కును చేరిన సినిమాగా 'హాయ్ నాన్న' ఘనత సాధించింది.

Hi Nanna Movie Crossed 1 Million Dollar Mark in Overseas.. Nani Creates Record

నాని ఖాతాలో తొమ్మిదో ఫిల్మ్: ఓవర్సీస్‌లో 'హాయ్ నాన్న' మూవీ 1 మిలియన్ డాలర్ల మార్కును చేరుకోవడంతో.. నేచురల్ స్టార్ నాని ఖాతాలో కొన్ని ఘనతలు వచ్చి చేరాయి. ముఖ్యంగా అక్కడ ఈ మార్కును చేరుకున్న అతడి తొమ్మిదో సినిమాగా ఇది నిలిచింది. అంతేకాదు, కొత్త డైరెక్టర్లతో 'నిన్ను కోరి', 'దసరా', 'హాయ్ నాన్న' ఒక మిలియన్ మార్కును అందుకున్న హీరోగానూ నాని రికార్డు సాధించాడు.

Hi Nanna Movie Crossed 1 Million Dollar Mark in Overseas.. Nani Creates Record

తెలుగులో రెండో హీరోగానూ: 'హాయ్ నాన్న' చిత్రంతో మరో 1 మిలియన్ డాలర్ మార్కును చేరుకున్న నాని.. ఏకంగా 9 సార్లు ఈ మైలురాయిని చేరాడు. తద్వారా అతడు రెండో స్థానానికి చేరుకున్నాడు. ఓవర్సీస్‌లో అత్యధికంగా మహేశ్ బాబు 11 సార్లు ఒక మిలియన్ డాలర్ల మార్కును చేరాడు. ఆ తర్వాత నాని 9 సినిమాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక, పవన్, ఎన్టీఆర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X