Hi Nanna USA Premier Collections నాని మూవీకి భారీ ఒపెనింగ్స్.. మృణాల్ క్రేజ్‌కు ఎన్ని కోట్లంటే?

నేచురల్ స్టార్ నాని, సీతారామం మూవీ ఫేమ్ మృణాల్ సేన్ జంటగా బేబీ కియారా ఖన్నా, జయరాం, నాజర్, అంగద్ బేడీ కీలక పాత్రల్లో నటించిన చిత్రం హాయ్ నాన్న. నూతన దర్శకుడు శౌర్యు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? కలెక్షన్ల ఎంత వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

హాయ్ నాన్న సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లతోపాటు ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 50 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఈ సినిమా కోసం 40 కోట్లు, ప్రమోషన్స్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక ప్రమోషనల్ ఈవెంట్లకు భారీ స్పందన లభించడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.

Hi Nanna Movie USA Premiers Collections: Nani, Mrunal Thakur movie good start at Overseas Box office

ఇక హాయ్ నాన్న ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ బిజినెస్‌కు మంచి డిమాండ్ కనిపించింది. నైజాం థియేట్రికల్ హక్కులను 9 కోట్ల రూపాయలు పలికింది. ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాలకు కలిపి 12.6 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 21.6 కోట్ల మేర జరిగింది.

అలాగే కర్ణాటక, మలయాళం, తమిళ, ఇతర రాష్ట్రాల హక్కులు భారీగానే అమ్ముడుపోయాయి. ఇతర రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ హక్కులు 6 కోట్ల రూపాయల మేర బిజినెస్ నమోదైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ సుమారుగా 33 కోట్ల రూపాయల మేర క్లోజ్ అయింది.

Hi Nanna Movie USA Premiers Collections: Nani, Mrunal Thakur movie good start at Overseas Box office

ఓవర్సీస్‌లో రిలీజ్ డేట్ కంటే ఒక రోజు ముందే ప్రీమియర్లను భారీగా ప్రదర్శించారు. అమెరికాలో జరిగిన ప్రీమియర్లకు మృణాల్ థాకూర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఇక 6.5 కోట్ల రూపాయలతో ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో హాయ్ నాన్న సినిమా బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది.

అమెరికాలో హాయ్ నాన్న సినిమాను అత్యధిక సెంటర్లలో ప్రీమియర్లు ప్రదర్శించారు. కడపటి వార్తలు అందే సరికి ఈ సినిమా నాని కేరీర్‌లో ఇంతకు ముందు మాదిరిగా అత్యధికంగా భారీగా కలెక్షన్లు రాబట్టింది. అమెరికాలో బుధవారం ప్రదర్శించిన ప్రీమియర్లకు 250k డాలర్లు అంటే.. 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X