తమన్నా చిత్రానికి శాటిలైట్‌రైట్స్ రు.40 కోట్లు
అజయ్‌దేవగన్ చిత్రాలలో శాటిలైట్ రైట్స్‌కు ఇంత భారీ రేటు రావడం ఇదే మొదటిసారి. అతని గత చిత్రాలలో బోల్‌బచ్చన్‌కు రు.28 కోట్లు, సింగంకు రు.30 కోట్లు సన్ ఆఫ్ సర్దార్‌కు రు.33 కోట్లు శాటిలైట్‌రైట్స్‌రూపంలో దక్కాయి. హిమ్మత్‌వాలా ఈనెల 29న విడుదల కాబోతోంది. ఇది 1983లో జితేంద్ర, శ్రీదేవి జంటగా రూపొందిన హిమ్మత్‌వాలాకు రీమేక్. కాగా, ఆ సినిమాకు మూలం తెలుగులో వచ్చిన ఊరికి మొనగాడు చిత్రం.
మరో ప్రక్క ఒక సినిమాకూడా విడుదల కాకుండానే తమన్నాకు ఆఫర్స్ వరసగా వచ్చి పడుతున్నాయి. ఆమె తాజా చిత్రం హిమ్మత్ వాలా.. ట్రైలర్స్ చూసిన బాలీవుడ్ జనం ఆమెచుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దాంతో తమన్నా హిందీలో మరో అవకాశాన్ని దక్కించుకొన్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా నటించబోయే చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎంపికైంది. ఈ యేడాది చివర్లో షూటింగ్ మొదలవుతుంది. హిమ్మత్ వాలా చిత్రం మార్చి 29 న విడుదల అవుతుంది.
వివరాల్లోకి వెళితే.. హిమ్మత్‌వాలా సినిమాతో అజయ్‌దేవగన్‌తో కలిసి బాలీవుడ్ తెరపై కనిపించబోతున్న తమన్నా భాటియా హిందీలో రెండో ప్రాజెక్ట్‌నుకూడా ఒప్పుకుంది. ఈసారి అక్షయ్ కుమార్‌తో ఆమె జోడీ కట్టబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రమేష్ తౌరాని రచయితలద్వయం సాజిద్-ఫర్హాద్‌ల దర్శకత్వంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో ప్రారంభం కానున్నట్లు భోగట్టా.
అక్షయ్ కుమార్, తన సన్నిహితుడైన సాజిద్ ఖాన్ నిర్మిస్తున్న హిమ్మత్‌వాలా ప్రచార చిత్రాలను చూశాడని, దీంతో అతను, రమేష్ తౌరాని కలిసి తమ కొత్త చిత్రంలో తమన్నాను తీసుకోవాలని నిర్ణయించారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. రచయితలద్వయం సాజిద్-ఫర్హాద్‌లు రూపొందించిన స్క్రిప్ట్‌ను అక్షయ్ ఓకే చేశాడనికూడా వెల్లడించాయి. సాజిద్-ఫర్హాద్‌లు ఇంతకుముందు గోల్‌మాల్, సింగమ్, డబుల్ ధమాల్, హౌస్‌ఫుల్ 2, బోల్ బచ్చన్ తదితర సినిమాలకు రచన చేశారు. ఈ సినిమాను రమేష్ తౌరనీ నిర్మిస్తారు. సాజిద్-ఫర్హాద్ ద్వయం దర్శకులు.


Click it and Unblock the Notifications












