Shehzada Collections: మరీ ఇంత దారుణమా? బడ్జెట్ లో సగం కూడా వెనక్కి వచ్చేలా లేవు..?
అల..వైకుంఠపురములో.. హిందీ రీమేక్ షెహజాద ఊహించిన విధంగా నెగిటివ్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ దెబ్బకు మళ్ళీ భవిష్యత్తులో రీమేక్స్ రావేమో అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగులో దాదాపు 200 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందించిన సినిమా హిందీ మార్కెట్లో మాత్రం చాలా దారుణమైన కలెక్షన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

ఈ ఏడాది మొదట్లోనే..
రోహిత్ ధావన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్, కృతి సనోన్ జంటగా నటించిన షెహజాద సినిమాను ఈ ఏడాది మొదట్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వలన సినిమా వాయిదా పడుతూ ఫిబ్రవరి 17వ తేదీన గ్రాండ్ విడుదల అయింది. విడుదలకు ముందు సాంగ్స్ తో కాస్త హడావిడి చేసినప్పటికీ కూడా ఏమాత్రం బజ్ అయితే పెరగలేదు.

సక్సెస్ అవుతుందేమో అని..
అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుందేమో అని తెలుగు నిర్మాతలు హారిక హాసిని గీతా ఆర్ట్స్, టీ సీరీస్ తో కూడా భాగస్వామ్యలుగా చేరారు. కానీ సినిమా అందరికీ కూడా ఊహించిన విధంగా షాక్ అయితే ఇచ్చింది. ఈ సినిమాకు మొదటి రోజు నెగిటివ్ టాక్ ఎక్కువగా రావడంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో చివరికి ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఫ్రీ అనే విధంగా ప్రమోషన్స్ కూడా చేశారు. దీంతో అప్పుడే సినిమా రిజల్ట్ తేలిపోయింది.

రెండు రోజుల తర్వాత..
షెహజాదకు మొదటి రోజు ఈ సినిమాకు చాలా తక్కువ స్థాయిలోనే ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు కేవలం 6 కోట్లు మాత్రమే రాగా రెండవ రోజు దాదాపు అదే రేంజ్ లో 6 కోట్ల 65 లక్షలు వచ్చాయి. ఇక రెండు రోజుల తర్వాత సినిమాకు మూడవ రోజు మాత్రం కాస్త కలిసి వచ్చింది. అది కూడా ఆదివారం కావడంతో సినిమాకు 7.55 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

4వ రోజు వచ్చిన కలెక్షన్స్
ఇక వీకెండ్ తర్వాత నాలుగవ రోజు కలెక్షన్స్ ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి. మొదటి రెండు మూడు రోజుల్లో అయితే ఎంతోకొంత ఈ సినిమాకు కలెక్షన్స్ పెరిగాయి. కానీ నాలుగవ రోజు దాదాపు అన్ని ఏరియాలలో కూడా ఒక్కసారిగా కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి. నాలుగో రోజు ఈ సినిమాకు కేవలం 2.25 కోట్ల రేంజ్ లోనే కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

4 రోజుల మొత్తం కలెక్షన్స్
అల్లు అర్జున్ అల..వైకుంటపురములో.. హిందీ ఆడియోన్స్ కూడా తెలుగులో లాంగ్వేజ్ లోనే చూశారు. అయితే తెలుగు సినిమా పాటలే అప్పటికే నార్త్ జనాలకు బాగా ఎక్కాయి. దీంతో షెహజాద సినిమా మాత్రం ఆ రేంజ్ లో ఆకట్టుకోలేదు. ముఖ్యంగా కార్తీక్ ఆర్యన్ బన్నీ రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు అని కామెంట్స్ వచ్చాయి. దీంతో మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ సినిమాకు 22.45 కోట్ల రేంజ్ లో మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి.

ఆ రేంజ్ లో నష్టాలు..
సినిమాను మొత్తంగా 65 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా పరిస్థితిని చూస్తూ ఉంటే కలెక్షన్స్ ఐదవ రోజు మళ్ళీ తక్కువగా వచ్చే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం సమయానికి థియేటర్ ఆక్యుపెన్సి కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇక మొత్తంగా చూస్తూ ఉంటే ఈ సినిమా 35 కోట్ల రేంజ్ లో మాత్రమే కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. దాదాపు ఈ సినిమా వలన 30 కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











