2.0 బాక్సాఫీసు పరిస్థితి ఇదీ: కలెక్షన్ సునామీ అనుకున్నారు కానీ....
రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందిన 2.0 హిందీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవనేది ట్రేడ్ విశ్లేషకుల మాట. విడుదల ముందు వరకు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు చూసి కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుందని భావించారు... కానీ ఉత్తరాది బాక్సాఫీసు వద్ద అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఇండియన్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ... అదే స్థాయిలో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందా? లేదా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

తొలి రోజు నుంచే
2.0 హిందీ వెర్షన్ భాక్సాఫీసు వద్ద తొలి రోజైన గురువారం రూ. 20. 25 కోట్లు వసూలు చేసింది. రెగ్యులర్ వర్కింగ్ డే కాబట్టి దీన్ని మంచి వసూళ్లుగా భావించవచ్చు. రెండో రోజైన శుక్రవారం వసూళ్లు అంతుకంటే ఎక్కువ ఉంటాయని భావించారు కానీ ఊహించని విధంగా తగ్గుముఖం పట్టాయి.

ఓ రేంజిలో హైప్ ఉన్నా
శుక్రవారం ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ రూ. 18 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో టోటల్ కలెక్షన్ రెండు రోజులు కలిపి రూ. 38.25 కోట్లకు చేరుకుంది. సాధారణంగా చూస్తే ఇవి మంచి నెంబర్సే అయినా సినిమాపై నెలకొన్న హైప్‌తో పోలిస్తే అంచనాలను అందుకోలేదనే చెప్పాలి.

మూడు రోజుల్లో ఎంతంటే...
అయితే శనివారం వసూళ్లు కాస్త పుంజుకున్నాయి. మూడో రోజు రూ.25 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో 3 డేస్ హిందీ వెర్షన్ కలెక్షన్ రూ. 63.25 కోట్లను క్రాస్ అయినట్లు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.

నిర్మాతల మౌనం
ఫస్ట్ వీకెండ్‌కు ఒక రోజు అదనంగా కలిసి వచ్చినా... రూ. 100 కోట్ల మార్కును అందుకునే అవకాశం లేదని సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే స్పష్టమవుతోంది. మరో వైపు నిర్మాతలు సైతం సినిమా వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు నెంబర్స్ ప్రకటించడానికి ఆసక్తి చూపడం లేదు.


Click it and Unblock the Notifications











