Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Hit 2 day 3 collection బాక్సాఫీస్ వద్ద హిట్ 2 అదే జోష్.. మూడో రోజు కలెక్షన్లు ఎంతంటే?
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్, మీనాక్షి చౌదరీ, రావు రమేష్, తనికెళ్ల భరణి, కోమలి ప్రసాద్ కీలక పాత్రల్లో నటించిన హిట్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధిస్తున్నది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం గత రెండు రోజుల్లో ఆ జోష్ చూపించలేకపోయింది. అయితే మూడో రోజు ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే?

తొలి రోజుతో పోల్చుకొంటే.. హెవీ డ్రాప్
ఇటీవల కాలంలో రిలీజ్‌కు ముందే సానుకూలమైన టాక్‌ను సొంతం చేసుకొన్న హిట్ 2 చిత్రం ప్రేక్షకుల అంచనాలను నిలబెట్టింది. దాంతో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ లభించింది. అయితే తొలి రోజుతో పోల్చుకొంటే.. రెండో రోజు 17 శాతం డ్రాప్ కనిపించింది. ఇక రెండో రోజుతో పోల్చుకొంటే.. మూడో రోజు మరో 15 శాతం డ్రాప్ కంటిన్యూ చేసింది. అయితే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం సెలవు దినాల్లో కలెక్షన్లను పెంచుకోలేకపోవడంపై ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.

గత రెండు రోజుల్లో ఎంతంటే?
హిట్ 2 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు, ఇతర రాష్ట్రాల్లో కలిపి తొలి రోజు 6.4 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండో రోజు 5.35 కోట్ల రూపాయాలను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా 11.75 కోట్లు రాబట్టింది. అమెరికాలో వసూళ్లను కలిపితే.. హిట్ చిత్రం 11 కోట్లకుపైగా షేర్, 19 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మూడో రోజు ఆక్యుపెన్సీ ఇలా..
ఇక మూడో రోజు హిట్ 2 ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. యావరేజ్ స్పందన కనిపించింది. హైదరాబాద్‌లో 50 శాతం, విజయవాడలో 29 శాతం, వరంగల్‌లో 41 శాతం, గుంటూరులో 40 శాతం, వైజాగ్‌లో 50 శాతం కాకినాడలో 65 శాతం వసూళ్లను రాబట్టింది. మిగితా జిల్లాలో 25 శాతం కంటే తక్కువగా కలెక్షన్లను నమోదు చేసింది.

మూడో రోజు కలెక్షన్లు ఇలా..
హిట్ 2 చిత్రం 3 రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. భీమవరంలో 3.6 లక్షలు, ఖమ్మంలో 3.1 లక్షలు, అనంతపురంలో 4.7 లక్షలు, కృష్ణా జిల్లాలో 20 లక్షలు సాధించింది. నైజాంలో 1.44 కోట్లు, సీడెడ్‌లో 41 లక్షలు, ఉత్తరాంధ్రలో 46 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 14 లక్షలు, వెస్ట్ గోదావరిలో 14 లక్షలు, గుంటూరులో 19 లక్షలు కలెక్ట్ చేసింది. తమిళనాడులో 18.5 లక్షలు నమోదు చేసింది. ఓవరాల్‌గా మూడో రోజుల తెలుగు, ఇతర రాష్ట్రాల్లో కలుపుకొని ఈ సినిమా 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో హిట్ 2 వసూళ్లు
ఇక అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 31 లక్షలు, రెండో రోజు 30 లక్షలు, మూడో రోజు 21 లక్షలతో కలిపి మొత్తం 56 లక్షల వసూళ్లు సాధించింది. ఇక అమెరికాలో గత రెండు రోజుల్లో 685980 డాలర్లు వసూలు చేసింది. కడపటి వార్తలు అందేసరికి ఆదివారం 96K డాలర్లు వసూలు చేసింది. ఓవరాల్‌గా ఈ చిత్రం తాజా వివరాల ప్రకారం 788K డాలర్లు రాబట్టింది.

హిట్ 2 లాభం ఎంతంటే?
హిట్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 15 కోట్లుగా అంచనా వేశారు. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు 14.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. వారాంతంలోనే ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించడం విశేషంగా మారింది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ లాభాలను సాధించిపెడుతుందో వేచి చూడాల్సిందే.