HIT 3 Closing Collections: హిట్ 3 హిట్టా? ఫట్టా? నాని మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై హిట్ 3: ది థర్డ్ కేస్ (హిట్ 3)ని ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? అనే వివరాల్లోకి వెళితే..

దసరా, సరిపోదా శనివారం సినిమాల హిట్స్‌తో నాని దూకుడు మీదున్నారు. తన హిట్ ట్రాక్ కంటిన్యూ చేయడంతో పాటు మాస్ ఇమేజ్ సాధించాలని నిర్ణయించుకున్న ఆయన తెరపై రక్తపాతం సృష్టించిన చిత్రమే హిట్ 3. డాక్టర్ శైలేష్ కొలను శ్రీకారం చుట్టిన హిట్ ఫ్రాంచైజీలో థర్డ్ కేస్‌గా ఈ సినిమా తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద హిట్ 3 మెరుగైన ప్రదర్శన చేసింది.

HIT 3 Box Office Closing Collections Worldwide How much loss or profit for Nani s Movie

హిట్ 3 బడ్జెట్ ఎంత?

హిట్ 3లో సూర్య శ్రీనివాస్, రావ్ రమేశ్, సుముద్రఖని, కోమలీ ప్రసాద్, నెపోలియన్, ప్రతీక్ బబ్బర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ స్వరాలు అందించగా.. సాను జాన్ వర్గీస్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రచార కార్యక్రమాలతో కలిపి హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌ అయ్యింది.

హిట్ 3 బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్

హిట్ ఫ్రాంఛైజీకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, నాని ఫాలోయింగ్, టీజర్, ట్రైలర్ల కారణంగా హిట్ 3 సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. రూ.48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. హిట్ 3 డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్‌ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మే 1న ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

హిట్ 3 కలెక్షన్స్

హిట్ 3 సినిమాకు ఇండియా వైడ్‌గా 21 రోజుల వరకు రూ.79.51 కోట్ల నికర వసూళ్లు వచ్చాయని సాక్‌నిల్క్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.72.34 కోట్ల నెట్ వచ్చింది. తమిళంలో రూ.1.82 కోట్ల నెట్, కన్నడంలో 55 లక్షల నెట్, హిందీలో రూ.4.02 కోట్ల నెట్, మలయాళంలో రూ.78 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.25 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. రాష్ట్రాల వారీగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే.. కర్ణాటకలో రూ.11.46 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.73 కోట్లు, తమిళనాడులో రూ.3.40 కోట్లు, కేరళలో రూ.1.12 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.5.50 కోట్లు చొప్పున ఇండియాలో రూ.93 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్‌లో రూ.25 కోట్లు + ఇండియాలో వచ్చిన గ్రాస్ వసూళ్లు రూ.93 కోట్లు కలిపి హిట్ 3 ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.118.34 కోట్ల గ్రాస్ వసూళ్లు ఆర్జించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Take a Poll

హిట్ 3కి ఎన్ని కోట్ల లాభమంటే?

హిట్ 3 సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ప్రకారం చూస్తే.. ఈ సినిమా పూర్తి రికవరీ సాధించి లాభాల్లోకి వచ్చింది. దాదాపు రూ.18 కోట్లకు పైగా లాభాలతో అజిత్ మూవీ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసింది. ఓవరాల్ బడ్జెట్, థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ అన్నింటి ద్వారా నిర్మాతకు భారీ లాభాలను అందించినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కొన్ని ఏరియాలలో ఈ సినిమాను థియేటర్ల నుంచి తొలగిస్తుండగా, ఈ వారాంతంతో థియేట్రికల్ రన్‌ ముగింపుపై పూర్తి క్లారిటీ రానుంది. మరి నాని తన పరుగు ఆపే వరకు ఎన్ని కోట్లు రాబడతాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X