HIT 3 Day 10 Collection: కలిసొచ్చిన శనివారం.. హిట్ 3కి భారీ కలెక్షన్స్‌.. నాని మూవీకి ఎన్ని కోట్లంటే ?

హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హిట్ 3. మే 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3ని నిర్మించారు. ఈ నేపథ్యంలో 10వ రోజు హిట్ 3 చిత్రం ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో చూస్తే:

హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్

హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్‌ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

HIT 3 Day 10 Box Office Collections Worldwide Nani s film sees weekend boost

థియేట్రికల్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్

నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర జరిగింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ 5 కోట్లు కింద ఇండియాలో ఈ సినిమా రూ.38.5 కోట్ల వ్యాపారం చేసింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్లు కలిపి మొత్తంగా హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇండియాలో 9 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.10.4 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.10.25 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.65 కోట్ల నెట్, ఆరో రోజున రూ.3.25 కోట్ల నెట్, ఏడో రోజున రూ.2.35 కోట్ల నెట్, 8వ రోజున రూ.2.1 కోట్ల నెట్, 9వ రోజున రూ.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

ఆంధ్రా, తెలంగాణ వసూళ్ల విషయానికి వస్తే తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్, మూడో రోజు రూ.9.8 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.9.4 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్ల నెట్ , ఆరో రోజున రూ.2.92 కోట్ల నెట్ , ఏడో రోజున రూ.2.1 కోట్ల నెట్, ఎనిమిదో రోజున రూ.2.03 కోట్ల నెట్, తొమ్మిదో రోజున రూ.1.83 కోట్ల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో నికరంగా 62 కోట్ల రూపాయలు రాబట్టాడు నాని.

ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళంలో రూ.కోటి 36 లక్షల నెట్, కన్నడంలో 32 లక్షల రూపాయల నెట్, హిందీలో కోటి 70 లక్షల రూపాయల నెట్, మలయాళంలో 70 లక్షల రూపాయలు ఆర్జించింది హిట్ చిత్రం.

ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?

ఓవర్సీస్‌ కలెక్షన్స్ హిట్ 3 సినిమాకు ప్లస్‌గా మారాయి. హిట్ 3 రూ.100 కోట్ల క్లబ్‌లోకి వేగంగా చేరడానికి ఓవర్సీస్ వసూళ్లు కారణమయ్యాయి. అక్కడ ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.24 కోట్ల వసూళ్లను సాధించింది

హిట్ 3 పదో రోజు వసూళ్లు ఎంతంటే?

10వ రోజు శనివారం వీకెండ్ కావడంతో హిట్‌ 3కి బాగానే బుకింగ్స్ జరిగాయి. 23.23 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ అందుకున్నట్లు సాక్‌నిల్క్ తెలిపింది. శనివారం హైదరాబాద్‌లో 373, బెంగళూరులో 286, విజయవాడలో 72, విశాఖపట్నంలో 108 షోలు పడ్డాయి. పదో రోజు ఈ హిట్ చిత్రం ఇండియాలో రూ.2.50 కోట్ల నికర వసూళ్లను సాధించింది. తద్వారా 10 రోజుల వరకు నాని సినిమా ఇండియాలో రూ.68.22 కోట్ల నెట్.. రూ.77.04 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్‌ వసూళ్లు రూ.24 కోట్లు కలిపి హిట్ 3 సినిమా 10 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.101 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. ఆదివారం కూడా నాని చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తాయని చిత్ర యూనిట్ ఎదురుచూస్తోంది. మరి అర్జున్ సర్కార్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X