HIT 3 Day 11 Collection: నాని వసూళ్ల జాతర.. రాజమౌళి రికార్డ్ బ్రేక్.. హిట్ 3 కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన చిత్రం హిట్ 3. నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 1న విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరిన హిట్ 3 .. 11వ రోజు ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో చూస్తే:
హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్
హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

థియేట్రికల్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర జరిగింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ 5 కోట్లు కింద ఇండియాలో ఈ సినిమా రూ.38.5 కోట్ల వ్యాపారం చేసింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్లు కలిపి మొత్తంగా హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఇండియాలో 10 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.10.4 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.10.25 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.65 కోట్ల నెట్, ఆరో రోజున రూ.3.25 కోట్ల నెట్, ఏడో రోజున రూ.2.35 కోట్ల నెట్, 8వ రోజున రూ.2.1 కోట్ల నెట్, 9వ రోజున రూ.2 కోట్ల నెట్, 10వ రోజున రూ. 3 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
ఆంధ్రా, తెలంగాణ వసూళ్ల విషయానికి వస్తే తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్, మూడో రోజు రూ.9.8 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.9.4 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్ల నెట్ , ఆరో రోజున రూ.2.92 కోట్ల నెట్ , ఏడో రోజున రూ.2.1 కోట్ల నెట్, ఎనిమిదో రోజున రూ.2.03 కోట్ల నెట్, తొమ్మిదో రోజున రూ.1.83 కోట్లు, పదో రోజున రూ.2.55 కోట్ల నెట్ చొప్పున తెలుగు రాష్ట్రాల్లో నికరంగా 65 కోట్ల రూపాయలు రాబట్టాడు నాని.
ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళంలో రూ.కోటి 46 లక్షల నెట్, కన్నడంలో 35 లక్షల రూపాయల నెట్, హిందీలో 2.15 కోట్ల రూపాయల నెట్, మలయాళంలో 72 లక్షల రూపాయలు ఆర్జించింది హిట్ చిత్రం.
ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో తనకు తిరుగులేదని నేచురల్ స్టార్ నాని నిరూపించుకున్నారు. హిట్ 3 చిత్రం ద్వారా తన కెరీర్‌లో 11వ సారి ఓవర్సీస్‌లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేశాడు. హిట్ 3 చిత్రానికి నార్త్ అమెరికా, ఇతర ఓవర్సీస్ మార్కెట్ కలిపి ఇప్పటి వరకు రూ.24.1 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
హిట్ 3 పదకొండో రోజు వసూళ్లు ఎంతంటే?
ఆదివారం కావడంతో హిట్ 3 బాగానే హోల్డ్ చేసింది. ఓవరాల్‌గా 22.13 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ అందుకున్నట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌లో 369, బెంగళూరులో 267, విజయవాడలో 68, విశాఖపట్నంలో 107 షోలు పడ్డాయి. మొత్తంగా 11వ రోజు నాని సినిమా ఇండియాలో రూ.2.25 కోట్ల నికర వసూళ్లను సాధించింది. తద్వారా 11 రోజుల వరకు హిట్ 3 ఇండియాలో రూ.71.68 కోట్ల నెట్.. రూ.80.09 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్ వసూళ్లు రూ.24.1 కోట్లు కలిపి నాని సినిమా 11 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది.
తద్వారా నాని దాదాపు 97 శాతం రికవరీ వెనక్కి రాబట్టినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. అలాగే ఈ ఏడాది విడుదలైన తెలుగు చిత్రాల్లో 100 కోట్లు దాటిన నాలుగో సినిమాగా నిలిచింది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌లు ఈ ఫీట్ సాధించాయి. అలాగే నాని కెరీర్‌లోనూ నాలుగో సెంచరీ సాధించిన చిత్రంగా హిట్ 3 నిలిచింది. ఈగ, దసరా, సరిపోదా శనివారం చిత్రాలు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టాయి. అలాగే హిట్ 3 చిత్రం తన అత్యధిక కలెక్షన్స్ మూవీస్‌లో ఈగ (రూ.100.85 కోట్లు)ను క్రాస్ చేసి సెకంట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ లిస్ట్‌లో రూ.118.67 కోట్లతో సరిపోదా శనివారం టాప్‌లో ఉంది.


Click it and Unblock the Notifications











