HIT 3 Day 12 Collection: పనిచేయని నాని మేజిక్.. హిట్ 3కి షాకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా డాక్టర్ శైలేష్ కొలను నుంచి వచ్చిన మూడో చిత్రం హిట్ 3. నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3ని నిర్మించారు. మే 1న విడుదలైన హిట్ 3.. 12వ రోజు ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో చూస్తే:
హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్
హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

థియేట్రికల్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ .. 15 కోట్ల మేర అమ్ముడయ్యాయి. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ 5 కోట్లు కింద ఇండియాలో ఈ సినిమా రూ.38.5 కోట్ల వ్యాపారం చేసింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్లు కలిపి మొత్తంగా హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఇండియాలో 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.10.4 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.10.25 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.65 కోట్ల నెట్, ఆరో రోజున రూ.3.25 కోట్ల నెట్, ఏడో రోజున రూ.2.35 కోట్ల నెట్, 8వ రోజున రూ.2.1 కోట్ల నెట్, 9వ రోజున రూ.2 కోట్ల నెట్, 10వ రోజున రూ. 3 కోట్ల నెట్, పదకొండవ రోజున రూ.2.28 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
ఆంధ్రా, తెలంగాణ వసూళ్ల విషయానికి వస్తే తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్, మూడో రోజు రూ.9.8 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.9.4 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్ల నెట్ , ఆరో రోజున రూ.2.92 కోట్ల నెట్ , ఏడో రోజున రూ.2.1 కోట్ల నెట్, ఎనిమిదో రోజున రూ.2.03 కోట్ల నెట్, తొమ్మిదో రోజున రూ.1.83 కోట్లు, పదో రోజున రూ.2.55 కోట్లు, పదకొండవ రోజున రూ.2.20 కోట్ల నెట్ చొప్పున తెలుగు రాష్ట్రాల్లో నికరంగా 67 కోట్ల రూపాయలు రాబట్టాడు నాని.
ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళంలో రూ.కోటి 46 లక్షల నెట్, కన్నడంలో 35 లక్షల రూపాయల నెట్, హిందీలో 2.15 కోట్ల రూపాయల నెట్, మలయాళంలో 72 లక్షల రూపాయలు ఆర్జించింది హిట్ చిత్రం. నానికి బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న ఓవర్సీస్‌లో హిట్ 3కి ఇప్పటి వరకు రూ.24.1 కోట్ల వసూళ్లు వచ్చాయి.
హిట్ 3 పన్నెండో రోజు వసూళ్లు ఎంతంటే?
వీకెండ్‌లో దుమ్మురేపిన హిట్ 3.. వర్కింగ్ డే అయిన సోమవారం మాత్రం షాకిచ్చింది. అన్ని ఏరియాలలోనూ బుకింగ్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. కేవలం 14.18 శాతం మాత్రమే థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 376, బెంగళూరులో 276, విజయవాడలో 58, విశాఖపట్నంలో 105 షోలు పడ్డాయి. 12వ రోజు నాని చిత్రం ఇండియాలో కేవలం రూ.93 లక్షల నికర వసూళ్లను మాత్రమే సాధించి నిరాశపరిచింది. తద్వారా 12 రోజుల వరకు హిట్ 3 ఇండియాలో రూ.72.61 కోట్ల నెట్.. రూ.80.09 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్ వసూళ్లు రూ.24.1 కోట్లు కలిపి నాని సినిమా 12 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.106 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది.
నైజాంలో లాభాల్లోకి హిట్ 3
నైజాం, ఓవర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ నాని చిత్రం ఆ ఊపును కంటిన్యూ చేయలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీడెడ్, ఆంధ్రా ఏరియాలలో హిట్ కోలుకోలేదని.. సెకండ్ వీకెండ్‌లో కలెక్షన్స్ మెరుగుపడకపోవడంతో ఆంధ్రా ప్రాంతంలోని చాలా ఏరియాలలో నాని సినిమా నష్టాలు మూటకట్టుకుందని చెబుతున్నారు. నైజాంలో హిట్ 3 లాభాలను అందుకోగా.. ఓవర్సీస్‌లో దాదాపు 2 మిలియన్ మార్క్‌ను చేరుకున్నప్పటికీ భారీ పంపిణీ, ప్రచార ఖర్చుల కారణంగా బ్రేక్ ఈవెన్ కాలేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో వచ్చిన కలెక్షన్ లెక్కలను బట్టి హిట్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వారం వసూళ్లను బట్టి హిట్ 3 భవితవ్యం ఆధారపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











