HIT 3 Day 13 Collection: 150 కోట్లతో రేర్ ఫీట్.. లెక్కలు మార్చేసిన నాని, హిట్ 3 కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్ 3. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3ని నిర్మించారు. మే 1న విడుదలైన హిట్ 3.. కొన్ని ఏరియాలలో బ్రేక్‌ఈవెన్ టార్గెట్ కొట్టేసింది.. కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఆపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలో 13వ రోజు నాని సినిమా ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో చూస్తే:

హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్

హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్‌ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

HIT 3 Day 13 Box Office Collections Worldwide Nani s contribution for HIT Universe To Cross 150 Crore

థియేట్రికల్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్

నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ .. 15 కోట్ల మేర అమ్ముడయ్యాయి. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ 5 కోట్లు కింద ఇండియాలో ఈ సినిమా రూ.38.5 కోట్ల వ్యాపారం చేసింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్లు కలిపి మొత్తంగా హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇండియాలో 12 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.10.4 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.10.25 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.65 కోట్ల నెట్, ఆరో రోజున రూ.3.25 కోట్ల నెట్, ఏడో రోజున రూ.2.35 కోట్ల నెట్, 8వ రోజున రూ.2.1 కోట్ల నెట్, 9వ రోజున రూ.2 కోట్ల నెట్, 10వ రోజున రూ. 3 కోట్ల నెట్, పదకొండవ రోజున రూ.2.28 కోట్లు, పన్నెండవ రోజున రూ.93 లక్షల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో 12 రోజుల వరకు ఇండియా వైడ్‌‌గా రూ.72.61 కోట్ల నెట్ సాధించింది హిట్ 3.

ఆంధ్రా, తెలంగాణ వసూళ్ల విషయానికి వస్తే తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్, మూడో రోజు రూ.9.8 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.9.4 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్ల నెట్ , ఆరో రోజున రూ.2.92 కోట్ల నెట్ , ఏడో రోజున రూ.2.1 కోట్ల నెట్, ఎనిమిదో రోజున రూ.2.03 కోట్ల నెట్, తొమ్మిదో రోజున రూ.1.83 కోట్లు, పదో రోజున రూ.2.55 కోట్లు, పదకొండవ రోజున రూ.2.20 కోట్లు, పన్నెండవ రోజున రూ.93 లక్షల నెట్ చొప్పున తెలుగు రాష్ట్రాల్లో నికరంగా 68 కోట్ల రూపాయలు రాబట్టాడు నాని.

హిట్ 3 పదమూడో రోజు వసూళ్లు ఎంతంటే?

సోమవారం నిరాశపరిచిన హిట్ 3 మంగళవారం పుంజుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పదమూడో రోజు ఓవరాల్‌గా 14.05 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. హైదరాబాద్‌లో 352, బెంగళూరులో 254, విజయవాడలో 61, విశాఖపట్నంలో 107 షోలు పడ్డాయి. 13వ రోజు నాని చిత్రం నికరంగా కోటి రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. తద్వారా 13 రోజుల వరకు హిట్ 3 ఇండియాలో రూ.73.5 కోట్ల నెట్.. రూ.80.09 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్‌ వసూళ్లు రూ.24.1 కోట్లు కలిపి నాని సినిమా 13 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.109.77 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది.

హిట్ ఫ్రాంఛైజీలో రేర్ రికార్డ్

హిట్ 3 తాజా వసూళ్లతో కలిపి హిట్ ఫ్రాంఛైజీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హిట్ ఫ్రాంఛైజీలోని మూడు సినిమాలు కలిపి రూ.150 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. విశ్వక్‌సేన్ నటించిన హిట్ 1 చిత్రం రూ.8.28 కోట్లు రాబట్టగా.. అడవి శేష్ నటించిన హిట్ 2 చిత్రం రూ.42.08 కోట్ల బిజినెస్ చేసింది. తాజాగా నాని నటించిన హిట్ 3 రూ.109.77 కోట్లు వసూలు చేసి హిట్ ఫ్రాంఛైజీలోనే తొలి 100 కోట్ల చిత్రంగా నిలిచింది. ఈ మూడు కలిపి ఇప్పటి వరకు హిట్ ఫ్రాంఛైజీ రూ.160.13 కోట్లు అందుకుంది. నాని చిత్రం లాంగ్ రన్‌లో రాబట్టే వసూళ్లను బట్టి ఈ నెంబర్ మారే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X