HIT 3 Day 14 Collection : ఆ ఏరియాల్లో గట్టెక్కని హిట్ 3.. నానికి సవాలే, 14వ రోజు ఎన్ని కోట్లంటే?

నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హిట్ 3. హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా మూడో సినిమాగా దీనిని నిర్మించారు. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3కి నిర్మాణం వహించారు. మే 1న విడుదలైన హిట్ 3 తొలుత జైత్రయాత్ర సాగించినప్పటికీ రెండో వారం వచ్చేసరికి డల్ అయ్యింది. ఈ నేపథ్యంలో 14వ రోజు నాని సినిమా ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో చూస్తే:

హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్

హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్‌ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

HIT 3 Day 14 Box Office Collections Worldwide Nani s film faces heavy drops

థియేట్రికల్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్

నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ .. 15 కోట్ల మేర అమ్ముడయ్యాయి. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ 5 కోట్లు కింద ఇండియాలో ఈ సినిమా రూ.38.5 కోట్ల వ్యాపారం చేసింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్లు కలిపి మొత్తంగా హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇండియాలో 13 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.10.4 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.10.25 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.65 కోట్ల నెట్, ఆరో రోజున రూ.3.25 కోట్ల నెట్, ఏడో రోజున రూ.2.35 కోట్ల నెట్, 8వ రోజున రూ.2.1 కోట్ల నెట్, 9వ రోజున రూ.2 కోట్ల నెట్, 10వ రోజున రూ. 3 కోట్ల నెట్, పదకొండవ రోజున రూ.2.28 కోట్లు, పన్నెండవ రోజున రూ.1.13 కోట్లు, పదమూడవ రోజున రూ.1.15 కోట్ల నెట్ వచ్చింది. దీంతో 13 రోజుల వరకు ఇండియా వైడ్‌‌గా రూ.73.26 కోట్ల నికర వసూళ్లు సాధించింది హిట్ 3.

ఆంధ్రా, తెలంగాణ వసూళ్ల విషయానికి వస్తే తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్, మూడో రోజు రూ.9.8 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.9.4 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్ల నెట్ , ఆరో రోజున రూ.2.92 కోట్ల నెట్ , ఏడో రోజున రూ.2.1 కోట్ల నెట్, ఎనిమిదో రోజున రూ.2.03 కోట్ల నెట్, తొమ్మిదో రోజున రూ.1.83 కోట్లు, పదో రోజున రూ.2.55 కోట్లు, పదకొండవ రోజున రూ.2.20 కోట్లు, పన్నెండవ రోజున రూ.96 లక్షలు, పదమూడవ రోజున రూ.82 లక్షల నెట్ చొప్పున తెలుగు రాష్ట్రాల్లో నికరంగా 70 కోట్ల రూపాయలు రాబట్టాడు నాని.

తమిళంలో కోటి 66 లక్షల నెట్, కన్నడంలో 45 లక్షల నెట్, హిందీలో రూ.3.13 కోట్ల నెట్, మలయాళంలో రూ.76 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.24.6 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.

14వ రోజు హిట్ 3 రోజు వసూళ్లు ఎంతంటే?

ఎండ దెబ్బకి మార్నింగ్, మ్యాట్నీలకు ఆడియన్స్ థియేటర్ల వంక కన్నెత్తి చూడటం లేదు. ఫస్ట్ షో, సెకండ్ షోలకు మాత్రం బుకింగ్స్ బాగుంటున్నాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 14వ రోజైన బుధవారం హిట్‌కి ఓవరాల్‌గా 12.19 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ తెలిపింది. హైదరాబాద్‌లో 359, బెంగళూరులో 249, విజయవాడలో 60, విశాఖపట్నంలో 99 షోలు పడ్డాయి.

14వ రోజు హిట్ 3 సినిమాకు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. బుధవారం ఇండియా వైడ్‌గా నికరంగా 75 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. తద్వారా 14 రోజుల వరకు హిట్ 3 ఇండియాలో రూ.75.15 కోట్ల నెట్.. రూ.86.09 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్‌ వసూళ్లు కలిపి నాని సినిమా 14 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.111.5 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది.

టోటల్ వసూళ్ల పరంగా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసిన హిట్ 3.. నైజాంలో పూర్తిగా లాభాల్లోకి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రలో వైజాగ్ ఏరియా సేఫ్ జోన్‌లోకి రాగా.. భారీ ప్రచార కార్యక్రమాలు, పెట్టుబడి కారణంగా ఓవర్సీస్‌లోని కొన్ని ఏరియాలు ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వీకెండ్‌ వచ్చే వసూళ్లను బట్టి హిట్ 3 థియేట్రికల్ రన్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X