HIT 3 Day 15 Collection: ఆ రికార్డుపై కన్నేసిన నాని.. కొడితే టాప్ ప్లేస్‌లోకే, హిట్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే
నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హిట్ 3. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3కి నిర్మాణం వహించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రెండు వారాల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి? 15వ రోజు నాని సినిమా ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో చూస్తే:
హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్
హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. మే 1న ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇండియాలో 14 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.10.4 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.10.25 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.65 కోట్ల నెట్, ఆరో రోజున రూ.3.25 కోట్ల నెట్, ఏడో రోజున రూ.2.35 కోట్ల నెట్, 8వ రోజున రూ.2.1 కోట్ల నెట్, 9వ రోజున రూ.2 కోట్ల నెట్, 10వ రోజున రూ. 3 కోట్ల నెట్, పదకొండవ రోజున రూ.2.28 కోట్లు, పన్నెండవ రోజున రూ.1.13 కోట్లు, పదమూడవ రోజున రూ.1.15 కోట్లు, 14వ రోజున 65 లక్షల రూపాయల నెట్ వచ్చింది. దీంతో 14 రోజుల వరకు ఇండియా వైడ్‌గా రూ.75.15 కోట్ల నికర వసూళ్లు సాధించింది హిట్ 3.
ఆంధ్రా, తెలంగాణ వసూళ్ల విషయానికి వస్తే తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్, మూడో రోజు రూ.9.8 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.9.4 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్ల నెట్ , ఆరో రోజున రూ.2.92 కోట్ల నెట్ , ఏడో రోజున రూ.2.1 కోట్ల నెట్, ఎనిమిదో రోజున రూ.2.03 కోట్ల నెట్, తొమ్మిదో రోజున రూ.1.83 కోట్లు, పదో రోజున రూ.2.55 కోట్లు, పదకొండవ రోజున రూ.2.20 కోట్లు, పన్నెండవ రోజున రూ.96 లక్షలు, పదమూడవ రోజున రూ.82 లక్షలు, పద్నాలగవ రోజున రూ.65 లక్షల నెట్ చొప్పున తెలుగు రాష్ట్రాల్లో నికరంగా 70 కోట్ల రూపాయలు రాబట్టాడు నాని. తమిళంలో కోటి 66 లక్షల నెట్, కన్నడంలో 45 లక్షల నెట్, హిందీలో రూ.3.13 కోట్ల నెట్, మలయాళంలో రూ.76 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.24.6 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.
హిట్ 3 రెండు వారాల కలెక్షన్స్
నాని చిత్రం తొలి వారం తెలుగులో రూ.59.74 కోట్లు, తమిళంలో రూ.1.3 కోట్లు, కర్ణాటకలో రూ. 29 లక్షలు, హిందీలో రూ.1.65 కోట్లు, మలయాళంలో రూ.67 లక్షల చొప్పున భారత్‌లో రూ.63.65 కోట్ల నికర వసూళ్లను సాధించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. రెండో వారం రూ.38 కోట్ల నెట్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
15వ రోజు హిట్ 3 రోజు వసూళ్లు ఎంతంటే?
మూడో వారం ప్రారంభంలోనే నానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 15వ రోజైన గురువారం ఈ సినిమాకు ఓవరాల్‌గా 12.76 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 352, బెంగళూరులో 239, విజయవాడలో 48, విశాఖలో 86 షోలు పడ్డాయి. 15వ రోజు ఇండియా వైడ్‌గా నికరంగా కేవలం 46 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. హిట్ 3 విడుదలైన నాటి నుంచి 50 లక్షల రూపాయల లోపు వసూలు కావడం ఇదే తొలిసారి.
తద్వారా 15 రోజుల వరకు హిట్ 3 ఇండియాలో రూ.75.68 కోట్ల నెట్.. రూ.86.09 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి నాని సినిమా 14 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. ప్రస్తుతం వీకెండ్‌పైనే నాని ఆశలు పెట్టుకున్నాడు. వారాంతంలో కలెక్షన్స్ బట్టి నాని సినిమా థియేట్రికల్ రన్ ఆధారపడి ఉంది. కొన్ని ఏరియాలలో హిట్ 3 థియేట్రికల్ రన్ ముగిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. నాని సినిమాలలో సరిపోదా శనివారం దాదాపు రూ.119 కోట్ల వసూళ్లతో టాప్‌లో ఉంది. ఈ వారం ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ రికార్డ్ బద్ధలు కొట్టాలని నాని చూస్తున్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతోందో?


Click it and Unblock the Notifications











