HIT 3 Day 17 Collection: నానిని ఊరిస్తున్న రేర్ రికార్డు.. ఈ వసూళ్లతో కష్టమే, హిట్ 3కి ఎన్ని కోట్లంటే?

డాక్టర్ శైలేష్ కొలను సృష్టించిన హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా తెరకెక్కిన మూడో చిత్రం హిట్ 3 : ది థర్డ్ కేస్ . నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3ని నిర్మించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రెండు వారాల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి? ఏయే ఏరియాలలో హిట్ 3 బ్రేక్ ఈవెన్ అయ్యింది? 17వ రోజు నాని సినిమా ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో చూస్తే:

హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్

హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్‌ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. మే 1న ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

HIT 3 Day 17 Box Office Collections Worldwide Nani s film needs 5 crores to cross dasara record

ఇండియాలో 16 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.10.4 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.10.25 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.65 కోట్ల నెట్, ఆరో రోజున రూ.3.25 కోట్ల నెట్, ఏడో రోజున రూ.2.35 కోట్ల నెట్, 8వ రోజున రూ.2.1 కోట్ల నెట్, 9వ రోజున రూ.2 కోట్ల నెట్, 10వ రోజున రూ. 3 కోట్ల నెట్, పదకొండవ రోజున రూ.2.28 కోట్లు, పన్నెండవ రోజున రూ.1.13 కోట్లు, పదమూడవ రోజున రూ.1.15 కోట్లు, 14వ రోజున కోటి రూపాయలు, 15వ రోజున రూ.85 లక్షలు, 16వ రోజున రూ.59 లక్షల నెట్ వచ్చింది. దీంతో 16 రోజుల వరకు ఇండియా వైడ్‌‌గా రూ.77 కోట్ల నికర వసూళ్లు సాధించింది హిట్ 3.

తెలుగు రాష్ట్రాల్లో హిట్ 3 కలెక్షన్స్

ఆంధ్రా, తెలంగాణ వసూళ్ల విషయానికి వస్తే తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్, మూడో రోజు రూ.9.8 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.9.4 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్ల నెట్ , ఆరో రోజున రూ.2.92 కోట్ల నెట్ , ఏడో రోజున రూ.2.1 కోట్ల నెట్, ఎనిమిదో రోజున రూ.2.03 కోట్ల నెట్, తొమ్మిదో రోజున రూ.1.83 కోట్లు, పదో రోజున రూ.2.55 కోట్లు, పదకొండవ రోజున రూ.2.20 కోట్లు, పన్నెండవ రోజున రూ.96 లక్షలు, పదమూడవ రోజున రూ.82 లక్షలు, పద్నాలగవ రోజున రూ.72 లక్షలు, పదిహేనవ రోజున రూ.64 లక్షలు, పదహరవ రోజున రూ.59 లక్షల నెట్ చొప్పున తెలుగు రాష్ట్రాల్లో నికరంగా 71 కోట్ల రూపాయలు రాబట్టాడు నాని. తమిళంలో రూ.1.74 కోట్ల నెట్, కన్నడంలో 49 లక్షల నెట్, హిందీలో రూ.3.48 కోట్ల నెట్, మలయాళంలో రూ.78 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.24.7 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.

హిట్ 3 రెండు వారాల కలెక్షన్స్

నాని చిత్రం తొలి వారం ఇండియా వైడ్ తెలుగులో రూ.59.74 కోట్లు, తమిళంలో రూ.1.3 కోట్లు, కర్ణాటకలో రూ. 29 లక్షలు, హిందీలో రూ.1.65 కోట్లు, మలయాళంలో రూ.67 లక్షల చొప్పున రూ.63.65 కోట్ల నికర వసూళ్లను సాధించింది. రెండో వారం తెలుగులో రూ.10.12 కోట్లు, తమిళంలో రూ.44 లక్షలు, కన్నడంలో రూ.2 లక్షలు, హిందీలో రూ.1.83 కోట్లు, మలయాళంలో రూ.11 లక్షల చొప్పున రూ.12.7 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

17వ రోజు హిట్ 3 రోజు వసూళ్లు ఎంతంటే?

రెండు వారాల వరకు హవా చూపించిన హిట్ 3 .. మూడో వారం నుంచి కలెక్షన్స్‌ను కోల్పోయింది. 17వ రోజైన శనివారం ఈ సినిమాకు ఓవరాల్‌గా 22.84 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 160, బెంగళూరులో 45, విజయవాడలో 26, విశాఖలో 54 షోలు పడ్డాయి. 17వ రోజు ఈ సినిమా ఇండియా వైడ్‌గా నికరంగా కేవలం 54 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. తద్వారా 17 రోజుల వరకు హిట్ 3 భారత్‌లో రూ.77.59 కోట్ల నెట్.. రూ.89.05 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్‌ వసూళ్లు కలిపి నాని సినిమా 17 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.113.75 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది.

ఈ గణాంకాలు చూస్తుంటే హిట్ 3 థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన నాని చిత్రం దసరాను హిట్ 3 క్రాస్ చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది. దసరా తన లాంగ్ రన్‌లో ఇండియా వైడ్ రూ.81.93 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఈ రికార్డును బద్ధలు కొట్టాలంటే హిట్ 3కి మరో రూ.5 కోట్లు అవసరం. అయితే ప్రస్తుతం వస్తున్న నెంబర్స్‌తో హిట్ 3 ఈ రికార్డును క్రాస్ చేయడం అసాధ్యమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి నాని రానున్న రోజుల్లో ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X