HIT 3 Day 19 Collection: షాకిచ్చేలా హిట్ 3 కలెక్షన్స్..బాలయ్యను కొట్టడం ఇంపాసిబుల్!
డాక్టర్ శైలేష్ కొలను సృష్టించిన హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా తెరకెక్కిన మూడో చిత్రం హిట్ 3 : ది థర్డ్ కేస్ థియేట్రికల్ రన్ ముగింపునకు చేరుకుంది. రెండు వారాల పాటు తన హవా చూపించిన హిట్ 3 మూడో వారంలో పూర్తిగా చేతులెత్తేసింది. నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి? 19వ రోజు నాని సినిమా ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో చూస్తే:
హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్
హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. మే 1న ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇండియాలో 18 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.10.4 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.10.25 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.65 కోట్ల నెట్, ఆరో రోజున రూ.3.25 కోట్ల నెట్, ఏడో రోజున రూ.2.35 కోట్ల నెట్, 8వ రోజున రూ.2.1 కోట్ల నెట్, 9వ రోజున రూ.2 కోట్ల నెట్, 10వ రోజున రూ. 3 కోట్ల నెట్, పదకొండవ రోజున రూ.2.28 కోట్లు, పన్నెండవ రోజున రూ.1.13 కోట్లు, పదమూడవ రోజున రూ.1.15 కోట్లు, 14వ రోజున కోటి రూపాయలు, 15వ రోజున రూ.85 లక్షలు, 16వ రోజున రూ.65 లక్షలు, 17వ రోజు రూ.67 లక్షలు, 18వ రోజు రూ.66 లక్షల నెట్ వచ్చింది. దీంతో 18 రోజుల వరకు ఇండియా వైడ్‌గా రూ.78 కోట్ల నికర వసూళ్లు సాధించింది హిట్ 3.
తెలుగు రాష్ట్రాల్లో హిట్ 3 కలెక్షన్స్
ఆంధ్రా, తెలంగాణ వసూళ్ల విషయానికి వస్తే తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్, మూడో రోజు రూ.9.8 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.9.4 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్ల నెట్ , ఆరో రోజున రూ.2.92 కోట్ల నెట్ , ఏడో రోజున రూ.2.1 కోట్ల నెట్, ఎనిమిదో రోజున రూ.2.03 కోట్ల నెట్, తొమ్మిదో రోజున రూ.1.83 కోట్లు, పదో రోజున రూ.2.55 కోట్లు, పదకొండవ రోజున రూ.2.20 కోట్లు, పన్నెండవ రోజున రూ.96 లక్షలు, పదమూడవ రోజున రూ.82 లక్షలు, పద్నాలగవ రోజున రూ.72 లక్షలు, పదిహేనవ రోజున రూ.64 లక్షలు, పదహరవ రోజున రూ.65 లక్షలు, 17వ రోజున రూ.67 లక్షలు, 18వ రోజున రూ.66 లక్షల నెట్ చొప్పున తెలుగు రాష్ట్రాల్లో నికరంగా 71.98 కోట్ల రూపాయలు రాబట్టాడు నాని. తమిళంలో రూ.1.80 కోట్ల నెట్, కన్నడంలో 53 లక్షల నెట్, హిందీలో రూ.3.90 కోట్ల నెట్, మలయాళంలో రూ.78 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.25 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.
రాష్ట్రాల వారీగా హిట్ 3 కలెక్షన్స్
హిట్ 3 సినిమాకు ఇప్పటి వరకు రాష్ట్రాల వారీగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే.. కర్ణాటకలో రూ.11.36 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.70.6 కోట్లు, తమిళనాడులో రూ.3.36 కోట్లు, కేరళలో రూ.1.12 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.5.41 కోట్లు చొప్పున ఇండియాలో రూ.91.85 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి
19వ రోజు హిట్ 3 వసూళ్లు ఎంతంటే?
19వ రోజు హిట్ 3 సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. వీకెండ్‌లోనే సత్తా చాటలేకపోయిన నాని చిత్రం వర్కింగ్ డే అయిన సోమవారం మరింత డల్ అయ్యింది. 19వ రోజు ఈ సినిమా ఇండియా వైడ్‌గా నికరంగా కేవలం 52 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. తద్వారా 19 రోజుల వరకు హిట్ 3 భారత్‌లో రూ.78.99 కోట్ల నెట్.. రూ.92.15 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి నాని సినిమా 19 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.117.15 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది.
ఈ గణాంకాలతో పాటు ఓటీటీ విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో హిట్ 3 థియేట్రికల్ రన్‌కి శుభం కార్డ్ పడినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ల తర్వాత హిట్ 3 నాలుగో స్థానంలో నిలిచింది. మరో రూ.9 కోట్లు సాధిస్తే డాకు మహారాజ్ కలెక్షన్స్ రికార్డును అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే హిట్ 3కి వస్తున్న వసూళ్లను చూస్తే ఇది కష్టమేనని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











