HIT 3 Day 2 Collections: 50 కోట్లు కుమ్మేసిన హిట్ 3.. నాని మూవీకి 2వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ హంగామా చేస్తున్నది. టాలీవుడ్‌కు బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లు అందిస్తున్న వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మాత ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, కోమలి ప్రసాద్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు. ఈ మూవీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు? తొలి రోజు ఏ మేరకు కలెక్షన్లు సాధించింది? రెండో రోజు ఏ మేరకు వసూలు చేసే అవకాశం ఉందనే వివరాల్లోకి వెళితే..

హిట్ 3 సినిమాలో అడవి శేష్, కార్తీ, మాగంటి శ్రీనాథ్ లాంటి హీరోలు అతిథి పాత్రల్లో మెరవడం, అలాగే మూవీని వివిధ ప్రాంతాల్లో షూట్ చేయడం, టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేయడంతో బడ్జెట్ భారీగానే అయింది. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమాకు భారీగానే బిజినెస్ జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్‌కు 6 కోట్ల రూపాయలు, శాటిలైట్ రైట్స్ సుమారుగా 12 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
హిట్ సినిమా తొలి ఆట నుంచి విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా హై రేంజ్‌లో నమోదు అయ్యాయి. ఈ సినిమా ఇండియాలో సుమారుగా 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 43 కోట్ల రూపాయలను రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో హిట్ 3 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ నైజాంలో 5 కోట్ల రూపాయల నెట్, ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో కలిపి 8 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. దాంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి ఈ సినిమా 13 కోట్ల రూపాయల నెట్.. 22.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఇక తెలుగేతర రాష్ట్రాల్లో నాని నటించిన సినిమా సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 1 కోటి రూపాయలు, కర్ణాటకలో 2.5 కోట్లు, కేరళలో 50 లక్షలు, హిందీలో 50 లక్షల రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 25 లక్షలు వసూలు చేసింది. దాదాపు ఈ సినిమా 4 కోట్ల మేర కలెక్ట్ చేసింది. దాంతో ఇండియాలో ఈ చిత్రం 26.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం దాదాపు 17 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 43 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని వాల్ పోస్టర్ సినిమా ప్రకటించింది.
హిట్ 3 సినిమా రెండో రోజు నిలకడగానే బాక్సాఫీస్ జర్నీని కొనసాగించింది. ఈ సినిమా తొలి రోజు రికార్డు వసూళ్ల తర్వాత కాస్త స్పీడ్ తగ్గించింది. ఈ సినిమా మార్నింగ్ షోకు 40 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 55 శాతం, ఫస్ట్ షోలకు 55 శాతం, సెకండ్ షోలకు 58 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని సాక్ నిల్క్ వెల్లడించింది. ఈ సినిమా రెండో రోజు 8 కోట్ల మేర వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దాంతో ఈ సినిమా మొత్తంగా 50 కోట్ల క్లబ్‌లో చేరుతుందని వారు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











