HIT 3 Day 5 Collections: 100 కోట్లు కొల్లగొట్టిన హిట్ 3.. నాని మూవీకి 5వ రోజు ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేయడమే కాకుండా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇది నాని కెరీర్‌లో 100 కోట్లు వసూలు చేసిన మూడో సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా గతంలో వచ్చిన హిట్ ఫ్రాంఛైజీలో మూడో సీక్వెల్‌గా వచ్చింది. మే 1వ తేదీన రిలీజైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో హిట్ 3 నాలుగు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 13 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3.75 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 12.27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణలో కలిపి 29 కోట్ల రూపాయలు నెట్, 49 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక తెలుగేతర ప్రాంతాల విషయానికి వస్తే.. కర్నాటక, ఇతర రాష్రాల్లో హిట్ 3 సినిమాకు మంచి ఆదరణ లభించింది. కన్నడలో 7.5 కోట్ల రూపాయల గ్రాస్, తమిళంలో 2.25 కోట్ల గ్రాస్, కేరళలో 70 లక్షల గ్రాస్, ఇతర ప్రాంతాల్లో 2.45 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ కన్నడ, తమిళం, కేరళ, ఇతర రాష్రాల్లో కలిపి 6.6 కోట్లు నెట్, 13 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
హిట్ 3 మూవీకి సంబంధించి ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 21 కోట్ల రూపాయల నెట్, 10.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 10.4 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 10.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా గత నాలుగు రోజుల్లో 52 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు కలెక్ట్ చేసింది.
హిట్ 3 సినిమాకు నార్త్ అమెరికా అంటే కెనడా, యూఎస్‌లో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. కేవలం 2 రోజుల్లోనే ఈ చిత్రం 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ప్రీమియర్, తొలిరోజున 1.2 మిలియన్ డాలర్లు, రెండో రోజు 333K డాలర్లు, మూడో రోజు 314K డాలర్లు, నాలుగో రోజు 167K డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా భారతీయ కరెన్సీలో ఇప్పటి వరకు 17 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇది నానికి దసరా, సరిపోదా శనివారం తర్వాత 2 మిలియన్ల క్లబ్‌లో చేరిన మూడో సినిమా కావడం విశేషంగా మారింది. నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి ప్రవేశించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకు 5వ రోజు కూడా మంచి స్పందన లభిస్తున్నది. ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 25 శాతం, మ్యాట్నికి 30 శాతం, ఫస్ట్ షోకు 45 శాతం, సెకండ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని అంచనా వేశారు. ఇక ఈ సినిమా ఇండియాలో 6 కోట్ల రూపాయలు, యూఎస్‌లో ఓ కోటి రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేశారు. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ 69 కోట్లు నెట్, 101 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











