HIT 3 Day 8 Collection : బుకింగ్స్ డ్రాప్ .. హిట్ 3కి దారుణంగా కలెక్షన్స్, నాని మూవీకి ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. నాని క్రేజ్, హిట్ ఫ్రాంఛైజీ మీదున్న బ్రాండ్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన హిట్ 3.. సోమవారం నుంచి మాత్రం కలెక్షన్స్ కోల్పోతూ వస్తోంది. మే 1న కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా హిట్ 3 విడుదలైంది. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3ని నిర్మించారు. ఈ నేపథ్యంలో 8వ రోజు హిట్ 3 చిత్రం ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో చూస్తే:

హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్
నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్.. ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యిందని ఫిలింనగర్ టాక్. సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.
థియేట్రికల్ రైట్స్ బిజినెస్
నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర జరిగింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ 5 కోట్లు కింద ఇండియాలో ఈ సినిమా రూ.38.5 కోట్ల వ్యాపారం చేసింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్లు కలిపి మొత్తంగా హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషన్ కార్యక్రమాల కారణంగా హిట్ 3పై హైప్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఇండియాలో ఏడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.10.4 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.10.25 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.65 కోట్ల నెట్, ఆరో రోజున రూ.3.25 కోట్ల నెట్, ఏడో రోజున రూ.2.35 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఏడు రోజుల వరకు ఇండియాలో హిట్ 3 నికరంగా 60.2 కోట్లు కలెక్ట్ చేసింది.
ఆంధ్రా, తెలంగాణ వసూళ్ల విషయానికి వస్తే తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్, మూడో రోజు రూ.9.8 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.9.4 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్ల నెట్ , ఆరో రోజున రూ.2.92 కోట్ల నెట్ , ఏడో రోజున రూ.2.1 కోట్ల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో నికరంగా 57 కోట్ల రూపాయలు రాబట్టాడు నాని.
ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళంలో రూ.కోటి 29 లక్షల నెట్, కన్నడంలో 27 లక్షల రూపాయల నెట్, హిందీలో కోటి 52 లక్షల రూపాయల నెట్, మలయాళంలో 62 లక్షల రూపాయలు ఆర్జించింది హిట్ చిత్రం.
ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో తనకున్న ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఎప్పటిలాగానే నాని మేజిక్ చేస్తున్నాడు. హిట్ 3 మేజర్ కలెక్షన్స్‌లో ఓవర్సీస్ వాటా ప్రధానమైనది. హిట్ 3 అక్కడ తొలి రోజు వన్ మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు రూ.23.5 కోట్లు కలెక్ట్ చేసింది హిట్ 3. వీకెండ్‌లో ఈ మొత్తం పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
హిట్ 3 ఎనిమిదో రోజు వసూళ్లు ఎంతంటే?
సోమవారం నుంచి హిట్ 3 తన బుకింగ్స్ కంటిన్యూగా కోల్పోతూనే వస్తోంది. ఎనిమిదో రోజైన గురువారం కూడా అదే రిపీట్ అయ్యింది. తెలుగులో 15.56 శాతం, తమిళంలో 19.01 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 522, బెంగళూరులో 375, విజయవాడలో 107, విశాఖలో 137 , చెన్నైలో 65 షోలు పడ్డాయి. ఎనిమిదో రోజు హిట్ 3 చిత్రం 2 కోట్ల నికర వసూళ్లను అందుకుంది. తద్వారా ఎనిమిది రోజుల వరకు నాని సినిమా ఇండియాలో రూ.63.14 కోట్ల నెట్.. రూ.72.14 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్ వసూళ్లు రూ.23.5 కోట్లు కలిపి హిట్ 3 సినిమా ఎనిమిది రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.96 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. అయితే హిట్ 3 చిత్రం 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదు రోజులుగా కలెక్షన్స్ డ్రాప్ కావడంతో డిజప్పాయింట్ అయిన చిత్ర యూనిట్ .. వీకెండ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి నాని ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











