HIT 3 Day 9 Collection : నానిని దెబ్బకొట్టిన కొత్త సినిమాలు.. హిట్ 3‌కి షాకింగ్ కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?

నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. మే 1న విడుదలైన ఈ చిత్రం తొలివారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది. అయితే సెకండ్ వీక్‌లో నాని సినిమాకు భారీ డ్రాప్స్ నమోదవుతున్నాయి. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3ని నిర్మించారు. ఈ నేపథ్యంలో 9వ రోజు హిట్ 3 చిత్రం ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో చూస్తే:

HIT 3 Day 9 Box Office Collections Worldwide Nani s film heading towards Saripodhaa Sanivaaram record

హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్

హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్‌ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

థియేట్రికల్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్

నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర జరిగింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ 5 కోట్లు కింద ఇండియాలో ఈ సినిమా రూ.38.5 కోట్ల వ్యాపారం చేసింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్లు కలిపి మొత్తంగా హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇండియాలో 8 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.10.4 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.10.25 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.65 కోట్ల నెట్, ఆరో రోజున రూ.3.25 కోట్ల నెట్, ఏడో రోజున రూ.2.35 కోట్ల నెట్, 8వ రోజున రూ.2.1 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. తొలి వారం హిట్ చిత్రం ఇండియా వైడ్ రూ.63.5 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఫస్ట్ వీక్‌లో తెలుగులో రూ.59.8 కోట్లు, తమిళంలో రూ.1.29 కోట్లు, కర్ణాటకలో రూ.27 లక్షలు, హిందీలో రూ.1.52 కోట్లు, మలయాళంలో రూ.62 లక్షలు కలెక్ట్ చేసింది హిట్ 3.

ఆంధ్రా, తెలంగాణ వసూళ్ల విషయానికి వస్తే తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్, మూడో రోజు రూ.9.8 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.9.4 కోట్ల నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్ల నెట్ , ఆరో రోజున రూ.2.92 కోట్ల నెట్ , ఏడో రోజున రూ.2.1 కోట్ల నెట్, ఎనిమిదో రోజున రూ.2.03 లక్షల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో నికరంగా 59 కోట్ల రూపాయలు రాబట్టాడు నాని.

ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళంలో రూ.కోటి 35 లక్షల నెట్, కన్నడంలో 27 లక్షల రూపాయల నెట్, హిందీలో కోటి 52 లక్షల రూపాయల నెట్, మలయాళంలో 62 లక్షల రూపాయలు ఆర్జించింది హిట్ చిత్రం.

ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?

ఎప్పటిలాగే ఓవర్సీస్‌లో నాని దుమ్మురేపుతున్నాడు. మే 1 నుంచి నేటి వరకు నార్త్ అమెరికా, తదితర దేశాల్లో హిట్ 3కి సాలీడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో నాని - శ్రీనిధి శెట్టిల సినిమాకు 23.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

హిట్ 3 ఎనిమిదో రోజు వసూళ్లు ఎంతంటే?

9వ రోజున శుక్రవారం హిట్ 3కి భారీగా బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. కొత్త సినిమాల ప్రభావం కూడా కొంతమేర చూపించిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే తెలుగు కంటే తమిళంలో మంచి ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిల్క్ తెలిపింది. శుక్రవారం తెలుగులో 16.29 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైతే అది తమిళంలో 27.31 శాతంగా ఉంది. 9వ రోజు హిట్ 3 చిత్రం 1.75 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

తద్వారా తొమ్మిది రోజుల వరకు నాని సినిమా ఇండియాలో రూ.65.27 కోట్ల నెట్.. రూ.72.05 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్‌ వసూళ్లు రూ.23.5 కోట్లు కలిపి హిట్ 3 సినిమా 9వ రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.96 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. ఈ వీకెండ్‌తో హిట్ 3 భవిష్యత్తు ఏంటో తేలిపోనుండటంతో చిత్ర యూనిట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X