Hit 3 Business: హిట్ 3 మూవీ బడ్జెట్ ఎంత? నాని కెరీర్‌లోనే రికార్డు ట్రేడ్..ప్రీ బిజినెస్ ఎన్ని కోట్లంట్లే?

నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం హిట్ 2. హిట్ సిరీస్‌లో భాగంగా వస్తున్న మూడో ఫ్రాంచైజీ చిత్రానికి డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు. ఈ సినిమా బడ్జెట్ ఏ మేరకు? ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

హిట్ 3 బడ్జెట్
హిట్ సిరీస్‌లో ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకొన్నాయి. దాంతో ప్రేక్షకుల అంచనాలు, స్టోరీ డిమాండ్ మేరకు ఈ సినిమా నిర్మాణాన్ని మరో రేంజ్‌కు చేర్చారు. విశాఖపట్నం, హైదరాబాద్, జమ్ము, కశ్మీర్ ప్రాంతాల్లో భారీగా షూట్ చేశారు. ఈ సినిమాకు టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేయడంతో బడ్జెట్ భారీగానే అయింది. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

Hit 3 Movie Business Worldwide

నాన్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ
హిట్ 3 సినిమాకు టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్‌కు 6 కోట్ల రూపాయలు, శాటిలైట్ రైట్స్ సుమారుగా 12 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

హిట్ 3 నైజాం, ఆంధ్రా థియేట్రికల్ బిజినెస్
ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నాని కెరీర్‌లోనే అత్యధికంగా బిజినెస్ జరిగిందనేది తాజా సమాచారం. ఈ సినిమా నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్ల రూపాయల మేర జరిగింది. అలాగే ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర జరిగింది. నైజాం, సీడెడ్, ఆంధ్రా కలిపి 33.5 కోట్ల రూపాయల ఆదాయం రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

హిట్ 3 ఓవర్సీస్ రైట్స్ వాల్యూ
అలాగే తెలుగేతర ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ మొత్తంగా 5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల మేర జరిగింది. దాంతో తెలుగేతర ప్రాంతాల బిజినెస్ 15 కోట్ల మేర ముగిసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 48.5 కోట్ల మేర ముగిసింది అని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.

హిట్ 3 లాభాల్లోకి రావాలంటే?
ఇదిలా ఉంటే.. ఓటీటీతో సహా నాన్ థియేట్రికల్, ఆడియో రైట్స్ కలిపితే.. 72 కోట్ల రూపాయలు, ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా 48.5 కోట్ల రూపాయలు నమోదైంది. దాంతో ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 120.5 కోట్ల రూపాయల వద్ద ముగిసింది. ఈ సినిమా నాని కెరీర్‌లో హయ్యెస్ట్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్‌గా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ లక్ష్యంగా బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X